గూగల్ నెక్సాస్ 5X అండ్ 6P ఇండియాలో ఆన్ లైన్ అండ్ ఆఫ్ లైన్ లో లాంచ్ అయ్యాయి

గూగల్ నెక్సాస్ 5X అండ్ 6P ఇండియాలో ఆన్ లైన్ అండ్ ఆఫ్ లైన్ లో లాంచ్ అయ్యాయి

గత నెలలో రెండు నెక్సాస్ ఫోనులు లాంచ్ చేసింది గూగల్ US లో. ఇప్పుడు అవి ఇండియాలో కూడా విడుదల చేసింది. ఈ రెండు మోడల్స్ మేజర్ ఆన్ లైన్ సైట్ లలో మరియు croma ఆఫ్ లైన్ స్టోర్స్ లో లభిస్తున్నాయి. ఈ రోజు మిడ్ నైట్ నుండి ఫ్లిప్ కార్ట్ లో ప్రీ ఆర్డర్స్ అవుతాయి.

LG నెక్సాస్ 5x 16 gbమరియు 32gb వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. 31,990 రూ. నుండి స్టార్ట్ అవుతున్నాయి. Huawei నెక్సాస్ 6P కూడా 32gb అండ్ 64gb వేరియంట్స్ లో ఉన్నాయి. 39,999 రూ నుండి స్టార్ట్ అవుతున్నాయి.

LG నెక్సాస్ 5x లో 5.2 in 1080 x 1920 పిక్సెల్స్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 808 SoC, 2gb ర్యామ్, 16gb/32gb ఇంబిల్ట్ స్టోరేజ్ ఆప్షన్స్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 2700 mah బ్యాటరీ ఉన్నాయి.

Huawei నెక్సాస్ 6P లో 5.7 in 1440 x 2560 పిక్సెల్స్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 810 SoC, 3gb ర్యామ్, 32/64gb ఇంబిల్ట్ స్టోరేజ్ ఆప్షన్స్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3450 mah బ్యాటరీ ఉన్నాయి.

ఈ రెండు మోడల్స్ లో USB Type – C పోర్ట్ మరియు క్విక్ చార్జింగ్, ఆండ్రాయిడ్ marshmallow 6.0 os ఉన్నాయి. రెండింటిలోనూ 12.3MP సోనీ IMX377 Exmor R సెన్సార్ ఉంది వెనుక. అలానే రెండూ 2K వీడియో రికార్డింగ్ అండ్ 240fps స్లో మోషన్ రికార్డింగ్ సపోర్ట్ చేస్తాయి.

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo