Gionee Max: Rs.5,999 ధరలో లేటెస్ట్ బెస్ట్ ఫీచర్లతో ఇండియాలో విడుదలయ్యింది

Gionee Max: Rs.5,999 ధరలో లేటెస్ట్ బెస్ట్ ఫీచర్లతో ఇండియాలో విడుదలయ్యింది
HIGHLIGHTS

Gionee Max ఈరోజు చాలా తక్కువ ధరలో లేటెస్ట్ బెస్ట్ ఫీచర్లతో ఇండియాలో విడుదలయ్యింది.

ఈ సంవత్సరం ఈ Gionee Max ఫోన్ లాంచ్ తో ఈ బ్రాండ్ రీ ఎంట్రీ తీసుకుంది.

జియోనీ మాక్స్ లో ఆక్టా-కోర్ ప్రాసెసర్, డ్యూయల్ రియర్ కెమెరా మరియు పెద్ద బ్యాటరీ వంటి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.

Gionee Max ఈరోజు చాలా తక్కువ ధరలో లేటెస్ట్ బెస్ట్ ఫీచర్లతో ఇండియాలో విడుదలయ్యింది. ఈ సంవత్సరం ఈ ఫోన్ లాంచ్ తో ఈ బ్రాండ్ రీ ఎంట్రీ తీసుకుంది. జియోనీ మాక్స్ లో ఆక్టా-కోర్ ప్రాసెసర్, డ్యూయల్ రియర్ కెమెరా మరియు పెద్ద బ్యాటరీ వంటి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అంతేకాదు, ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కేవలం ఎంట్రీ లెవల్ ధరలకు అందించబడుతుంది. ఈ ఫోన్ సింగిల్ ర్యామ్ మరియు స్టోరేజ్ ఆప్షన్లలో మాత్రమే తీసుకురాబడింది.

Gionee Max: ధర

జియోనీ మాక్స్ 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ తో తీసుకురాబడింది మరియు దీని ధర రూ .5,999 మాత్రమే. ఈ ఫోన్ బ్లాక్, రెడ్ మరియు రాయల్ బ్లూ వంటి మూడు రంగులలో ప్రవేశపెట్టబడింది. జియోనీ మాక్స్ ఆగస్టు 31 నుండి ఫ్లిప్ ‌కార్ట్ ‌లో అమ్మకం కానుంది.

Gionee Max: స్పెసిఫికేషన్

ఈ జియోనీ మాక్స్ ఆండ్రాయిడ్ 10 లో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ లో 6.1-అంగుళాల హెచ్‌డి + డిస్ప్లే ఉంది, దీనికి 2.5 డి కర్వ్డ్ గ్లాస్ స్క్రీన్ రక్షణ ఇవ్వబడింది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ Unisoc 9863A SoC శక్తిని కలిగి ఉంది మరియు 2GB RAM తో జత చేయబడింది. ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా అందించబడింది, దీనిలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది.

జియోనీ మాక్స్ 32 జిబి స్టోరేజ్ కలిగి ఉంది, దీనిని మైక్రో ఎస్డి కార్డ్ నుండి 256 జిబి వరకు పెంచవచ్చు. ఈ ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది మరియు ఇది రివర్స్ ఛార్జింగ్ కి మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ కోసం, జియోనీ మాక్స్ 4 జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ 4.2, జిపిఎస్ / ఎ-జిపిఎస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ మరియు మైక్రో యుఎస్‌బి పోర్ట్‌ను కలిగి ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo