Flipkart The Big Billion Days ఎర్లీ బర్డ్ డీల్స్ అనౌన్స్: బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్ పై ఒక లుక్కేయండి.!

Updated on 10-Sep-2025
HIGHLIGHTS

Flipkart The Big Billion Days సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది

ఈ అప్ కమింగ్ సేల్ ఎర్లీ బర్డ్ డీల్స్ కూడా అనౌన్స్ చేసింది

ఈ సేల్ నుంచి అందించబోతున్న బెస్ట్ డీల్స్ వెల్లడించింది

Flipkart The Big Billion Days 2025 ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ ఈ అప్ కమింగ్ సేల్ ఎర్లీ బర్డ్ డీల్స్ కూడా అనౌన్స్ చేసింది. అంటే, ఈ సేల్ నుంచి అందించబోతున్న బెస్ట్ డీల్స్ వెల్లడించింది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు విడుదల చేసిన ఎర్లీ బర్డ్ డీల్స్ నుంచి బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ పై ఒక లుక్కేయండి.

Flipkart The Big Billion Days ఎర్లీ బర్డ్ డీల్స్ ఏమిటి?

ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి అందించనున్న ఎర్లీ బర్డ్ డీల్స్ రివీల్ చేసింది ఇందులో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ కూడా ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది మరియు ఒకరోజు ముందుగానే ప్లస్ మరియు ఫ్లిప్ కార్ట్ బ్లాక్ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. ఈ సేల్ నుంచి ఈ బెస్ట్ డీల్స్ ను మీరు అందుకోవచ్చు.

Nothing Phone (3)

ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ అందించిన ఎర్లీ బర్డ్ డీల్స్ లో ఈ ఫోన్ ను ముందుగా అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ రీసెంట్ గా ఇండియాలో లాంచ్ అయ్యింది మరియు ఈ ఫోన్ ప్రీమియం ఫీచర్స్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 79,999 ధరతో సేల్ అవుతుండగా ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ప్రైస్ మరియు ఆఫర్స్ అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.

Apple iPhone 16

ఆపిల్ కొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసిన వెంటనే పాత ఫోన్ల రేట్లు తగ్గించింది. అందుకే, ఐఫోన్ 16 సీరిస్ మరింత చావా ధరకు లభిస్తుంది. ఇది కాకుండా ఈ ఫోన్స్ పై 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ మరియు ఎక్స్ చేంజ్ బోనస్ వంటి ఆఫర్లు లభించే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఐఫోన్ 16 ఫోన్ ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి తక్కువ ధరలో లభించే అవకాశం ఉంటుంది.

Also Read: Apple iPhone Air: అత్యంత స్లీక్ ఐఫోన్ వచ్చేసింది.. ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

Samsung Galaxy S24

శామ్సంగ్ కూడా గెలాక్సీ S సిరీస్ నుంచి కొత్త ఫోన్లు లాంచ్ చేసింది. ఈ ఫోన్స్ లాంచ్ తర్వాత గత సిరీస్ ఫోన్స్ రేట్లు తగ్గించింది. ఇది కాకుండా స్నాప్ డ్రాగన్ చిప్ సెట్ తో శామ్సంగ్ గెలాక్సీ S24 కొత్త వేరియంట్ ను లాంచ్ చేసింది. కాబట్టి గెలాక్సీ S24 ఓల్డ్ మోడల్ పై భారీ తగ్గింపు మరియు 10% అదనపు డిస్కౌంట్ అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫోన్ కూడా ఫ్లిప్ కార్ట్ అప్ కమింగ్ సేల్ నుంచి తక్కువ ధరలో లభించే అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :