LAVA Virat V1 5G ఫస్ట్ డే సేల్ వన్ డే బిగ్ డీల్ మిస్ చేసుకోకండి.!

HIGHLIGHTS

LAVA Virat V1 5G ఫస్ట్ డే సేల్ వన్ డే బిగ్ డీల్ మిస్ చేసుకోకండి

ఇది కేవలం 12 గంటలు మాత్రమే అందుబాటులో ఉండే లాంచ్ ఆఫర్

ఫస్ట్ డే సేల్ నుంచి ఈ ఫోన్ మరింత చవక ధరలో లభిస్తుంది

LAVA Virat V1 5G ఫస్ట్ డే సేల్ వన్ డే బిగ్ డీల్ మిస్ చేసుకోకండి. ఎందుకంటే, ఇది కేవలం 12 గంటలు మాత్రమే అందుబాటులో ఉండే లాంచ్ ఆఫర్. ఈ ఆఫర్ మిస్ చేసుకుంటే ఇక ఈ ఫోన్ సేల్ అయినంత కాలం లభించదు. ఇది బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో లావా లాంచ్ చేసిన లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ మరియు ఫస్ట్ డే సేల్ నుంచి ఈ ఫోన్ మరింత చవక ధరలో లభిస్తుంది.

LAVA Virat V1 5G ఫస్ట్ సేల్ డీల్ ఏమిటి?

లావా ఈ ఫోన్ ను కేవలం రూ. 12,999 ధరతో లాంచ్ చేసింది. అయితే, జూలై 31వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమయ్యే ఫస్ట్ సేల్ లో ఈ ఫోన్ కేవలం రూ. 11,999 రూపాయల లాంచ్ ఆఫర్ ధరలో సేల్ అవుతుంది. అంటే, ఈ ఫోన్ రూ. 1,000 తగ్గింపుతో ఫస్ట్ సేల్ నుంచి లభిస్తుంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ ను Flipkart Axis మరియు Flipkart SBI క్రెడిట్ కార్డు తో కొనేవారికి రూ. 600 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

అంటే, రేపు జరిగే ఫస్ట్ సేల్ నుంచి ఈ ఫోన్ కొనే వారికి కేవలం రూ. 11,399 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. పెరిగిన స్మార్ట్ ఫోన్ ధరలతో 5జి ఫోన్ కొనాలంటే ఖర్చు ఎక్కువ అవ్వగా, లావా మాత్రం కేవలం 12 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే ఈ ఫోన్ అందించడం విశేషం.

Also Read : Poco M8 Power : పోకో ఈసారి M సిరీస్ ఫోన్ ను ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేస్తోంది.!

LAVA Virat V1 5G : ఫీచర్స్

లావా విరాట్ వి1 స్మార్ట్ ఫోన్ 6.75 ఇంచ్ LCD డిస్ప్లేని HD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బడ్జెట్ 5G చిప్ సెట్ Unisoc T8200 Soc తో నడుస్తుంది మరియు జతగా 4GB ఫిజికల్ అండ్ 4GB వర్చువల్ ర్యామ్ జతగా 64GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ యాడ్స్ మరియు బ్లోట్ వేర్ లేని క్లీన్ ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అయ్యింది.

ఈ లవ్ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ 13MP Ai డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ మరియు ముందు 5MP సెల్ఫీ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ ఫోన్ FHD వీడియో రికార్డింగ్ మరియు లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6000 mAh భారీ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :