Pebble Seeq AI Smart Glasses launched under 10k budget price in India
Pebble Seeq: ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతం ప్రీమియం ధరలో మాత్రమే ఈ ఏఐ స్మార్ట్ గ్లాసులు లభిస్తుండగా, పెబుల్ మాత్రం బడ్జెట్ ధరకే మతి పోగొట్టే ఫీచర్స్ తో AI Smart Glasses లాంచ్ చేసింది. UHD కెమెరా, Openwave X ఆడియో, Ai లైవ్ ట్రాన్స్‌లేషన్ మరియు మరిన్ని లేటెస్ట్ ఫీచర్స్ తో ఈ స్మార్ట్ కళ్ళజోడును పెబుల్ లాంచ్ చేసింది. ఇండియన్ మార్కెట్లో ఉన్న బడ్జెట్ యూజర్ కు కూడా స్మార్ట్ గ్లాసెస్ ని చేరువ చేయడమే లక్ష్యంగా ఈ స్మార్ట్ కళ్లజోడును లాంచ్ చేసినట్లు కంపెనీ తెలిపింది.
పెబుల్ ఈ లేటెస్ట్ స్మార్ట్ కళ్లజోడు సీక్ ను కేవలం రూ. 9,999 ధరకే విడుదల చేసింది. ఈ స్మార్ట్ గ్లాసెస్ పై రూ. 500 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ మరియు 6 నెలల No Cost EMI ఆఫర్ కూడా అందించింది. ఈ స్మార్ట్ కళ్ళజోడును పెబుల్ అఫీషియల్ సైట్ మరియు ఎంపిక చేసిన ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లలో కూడా కొనుగోలు చేయవచ్చు.
ఈ స్మార్ట్ గ్లాసెస్ లో 8 మెగాపిక్సెల్ AI కెమెరాను అందించింది. ఈ కెమెరా4K రిజల్యూషన్ ఫోటోలు తీయగలదు మరియు FHD వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ గ్లాస్ కలిగిన స్మార్ట్ ఫీచర్ తో వాయిస్ కమాండ్స్ లేదా ఫ్రేమ్ పై ఉన్న ఫిజికల్ కంట్రోల్స్ ద్వారా కూడా ఈ కెమెరాను ఆపరేట్ చేయవచ్చు. ఈ గ్లాసెస్ తో రికార్డింగ్ చేసేటప్పుడు ప్రత్యేక ప్రైవసీ ఇండికేటర్ లైట్ వెలుగుతుంది.
ఈ గ్లాసెస్ AI అసిస్టెంట్ సపోర్ట్ తో వస్తుంది. జస్ట్ “Hey, Seeq” అనే వాయిస్ కమాండ్ ద్వారా మీరు ఈ కళ్లజోడులో ఉన్న AI అసిస్టెంట్ ను యాక్టివేట్ చేయవచ్చు. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, మీకు కావలసిన సమాచారాన్ని వెతకడం, ఫోటోలు తీయడం, వాయిస్ కమాండ్స్ ను అమలు చేయడం వంటి పనులు మీరు ఈ ఫీచర్ తో హ్యాండ్స్ ఫ్రీగా నిర్వహించవచ్చు. మరింత గొప్ప విషయం ఏమిటంటే, ఈ స్మార్ట్ గ్లాస్ 75 కు పైగా భాషల్లో రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్ చేసే సత్తా కలిగి ఉంది.
ఈ స్మార్ట్ గ్లాసెస్ ప్రత్యేకమైన ఆడియో సపోర్ట్ కూడా అందించింది. పెబుల్ ఇందులో OpenWave X ఓపెన్ ఇయర్ టెక్నాలజీని ఉపయోగించింది. ఈ ఫీచర్ తో చెవులు వెలుపలే సౌండ్ అందిస్తుంది. అయితే, ఇది కేవలం మీకు మాత్రమే వినిపిస్తుంది మరియు మీ ప్రైవసీకి భంగం వాటిల్లదు. ఇందులో సంగీతం వినడం మరియు కాల్స్ మాట్లాడడం కూడా సాధ్యమవుతుంది. చుట్టూ ఉన్న శబ్దాన్ని కూడా యూజర్ వినగలిగే విధంగా ఈ స్మార్ట్ గ్లాస్ ను డిజైన్ చేశారు. అంతేకాదు, ఇది ప్రిస్క్రిప్షన్ లెన్స్ సపోర్ట్ తో కూడా వస్తుంది.
Also Read : iQOO Z11 Lite 5G ఫస్ట్ సేల్ రేపు స్టార్ట్ అవుతుంది .. సేల్ ఆఫర్స్ తెలుసుకోండి.!
ఈ స్మార్ట్ గ్లాస్ ఫ్రేమ్‌పై టచ్ జెశ్చర్ కంట్రోల్స్ కూడా అందించారు. దీని ద్వారా మ్యూజిక్ మార్చడం, కాల్స్ అటెండ్ చేయడం మరియు AI అసిస్టెంట్ ను యాక్టివేట్ చేయడం వంటి పనులు చేయవచ్చు.