IITM pune developed and introduces Lightning Alert app Damini
Damini : వర్షాకాలం ప్రారంభమైతే భారీ వర్షంతో పాటు పిడుగులు కూడా ఎక్కువగా పడుతుంటాయి. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం, ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా పిడుగుపాటుకు వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ఎండనక వాననకా చూడక అహర్నిశలు మనకు అన్నం పెట్టె రైతులు మరియు వారికి సహాయం చేసే రైతు కూలీలు ఎక్కువగా ఈ పిడుగు పాటుకు బలవుతున్నారు. అంతేకాదు, మత్స్యకారులు, నిర్మాణ కార్మికులు, బహిరంగ ప్రదేశాల్లో పని చేసే ఉద్యోగులు కూడా పిడుగుపాటుకు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిడుగు ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి అప్రమత్తం చేసే మొబైల్ యాప్ ‘దామిని: లైటినింగ్ అలర్ట్’ ను IITM పూణే పరిచయం చేసింది.
దామిని: లైటినింగ్ అలర్ట్ అనేది భారత భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ (MoES) ఆధ్వర్యంలో పనిచేసే IITM పూణే అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్. ఈ యాప్ మీ ప్రస్తుత ప్రాంతంలో పిడుగు పడే అవకాశాలు ముందుగానే తెలియచేస్తుంది. ఇలా చేయడం వలన మీరు సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు సమయం లభిస్తుంది.
ఈ యాప్ దేశవ్యాప్తంగా ఉన్న మెరుపుల గుర్తింపు వ్యవస్థ, వాతావరణ డేటా మరియు శాస్త్రీయ నమూనాలను ఉపయోగించి పిడుగు సంభవించే అవకాశాలు విశ్లేషిస్తుంది. ఈ లెక్కల ద్వారా ఏదైనా ప్రాంతంలో పిడుగు పడే ప్రమాదం ఉన్నప్పుడు వినియోగదారులకు వెంటనే అలర్ట్ పంపుతుంది.
Also Read : Moto Pad 70 Groove: పేరుకే టాబ్లెట్ కానీ సౌండ్ బార్ మాదిరిగా 9 JBL స్పీకర్స్ తో వస్తుంది.!
ఈ యాప్ మీ మొబైల్ లోని GPS లొకేషన్ ఆధారంగా మీరు ప్రస్తుతం ఉన్న ప్రాంతాన్ని గుర్తిస్తుంది. మీ పరిసర ప్రాంతంలో పిడుగు ఏర్పడే పరిస్థితులు ఉన్నప్పుడు నోటిఫికేషన్ ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తుంది. సాధారణంగా పిడుగు పడే అవకాశాలు ఉండే సమయానికి ముందే అలర్ట్ ఇవ్వడం వల్ల మీరు సురక్షితమైన భవనం లేదా ఆశ్రయం చేరుకునే అవకాశం మీకు లభిస్తుంది. మీరు ఈ యాప్ ను ఉపయోగించాలంటే మీ మొబైల్ ఫోన్ లో ఉన్న రియల్ టైం Location (GPS) సేవలు ఎప్పుడూ ఆన్ చేసి ఉంచాలి. అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ కూడా మీ ఫోన్ లో అందుబాటులో ఉండాలి.
పిడుగు ప్రమాద హెచ్చరిక వచ్చినప్పుడు ఈ యాప్ మీకు కొన్ని ముఖ్యమైన సూచనలు కూడా అందిస్తుంది. ఈ లిస్ట్ ఇక్కడ చూడవచ్చు.
ఇది యూజర్ రక్షణ కోసం అందించే ఉత్తమమైన సూచనలుగా ఉంటాయి. మాన్సూన్ ఇప్పటికే మొదలైంది. కాబట్టి, పిడుగుపాటు నుంచి తప్పించుకోవడానికి ఈ ఉచిత యాప్ సహాయం తీసుకోవచ్చు. ఈ యాప్ Android మరియు iOS రెండు ప్లాట్ ఫామ్ లలో కూడా అందుబాటులో ఉంది.