Moto Pad 70 Groove: పేరుకే టాబ్లెట్ కానీ సౌండ్ బార్ మాదిరిగా 9 JBL స్పీకర్స్ తో వస్తుంది.!

HIGHLIGHTS

స్మార్ట్ ఫోన్ తో పోలిస్తే టాబ్లెట్ మరింత గొప్ప ఎంటర్టైన్మెంట్ అందించే పరికరం గా ఉంటుంది

Moto Pad 70 Groove 9 JBL స్పీకర్స్ తో సౌండ్ బార్ మాదిరి సౌండ్ అందించే కొత్త టాబ్లెట్

ఈ టాబ్లెట్ లో 4 ట్వీటర్ లు, 3 ఉఫర్స్ మరియు 2 పాసివ్ రేడియేటర్ తో టోటల్ 9 స్పీకర్లు ఉంటాయి

Moto Pad 70 Groove: పేరుకే టాబ్లెట్ కానీ సౌండ్ బార్ మాదిరిగా 9 JBL స్పీకర్స్ తో వస్తుంది.!

Moto Pad 70 Groove: స్మార్ట్ ఫోన్ తో పోలిస్తే టాబ్లెట్ మరింత గొప్ప ఎంటర్టైన్మెంట్ అందించే పరికరం గా ఉంటుంది. టాబ్లెట్ లు కలిగి ఉండే పెద్ద స్క్రీన్, పెద్ద బ్యాటరీ మరియు సౌండ్ సపోర్ట్ వీటిని ఎంటర్టైన్మెంట్ కోసం గొప్ప ఆప్షన్ గా మారుస్తాయి. ఇప్పుడు ఈ ఎంటర్టైన్మెంట్ పరికరాన్ని మరింత తార స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది మోటోరోలా. పెద్ద స్క్రీన్ మరియు బిగ్ బ్యాటరీతో పాటు ఆడియో ఫీచర్ కి కూడా పెద్ద పీట వేస్తూ ఏకంగా 9 JBL స్పీకర్స్ తో సౌండ్ బార్ మాదిరి సౌండ్ అందించే కొత్త టాబ్లెట్ ను లాంచ్ చేస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Moto Pad 70 Groove: లాంచ్ డేట్

మోటరోలా లాంచ్ చేస్తున్న ఈ అప్ కమింగ్ ఈ టాబ్లెట్ జూలై 31వ తేదీ మధ్యాహ్నం ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అవుతుంది. ఈ అప్ కమింగ్ టాబ్లెట్ సరికొత్త డిజైన్ మరియు భారీ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా అందించిన మైక్రో సైట్ టీజర్ పేజీ ద్వారా ఈ టాబ్లెట్ యొక్క లాంచ్ డేట్ మరియు ఫీచర్లు కూడా రివీల్ చేసింది.

Moto Pad 70 Groove: ఫీచర్స్

మోటరోలా రెండు రోజుల్లో లాంచ్ చేయబోతున్న ఈ టాబ్లెట్ సరికొత్త మరియు ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది. ఇది విజువల్ వండర్ అందించే 12.1 ఇంచ్ బిగ్ స్క్రీన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 800 నిట్స్ HBM బ్రైట్నెస్, HDR 10 మరియు డాల్బీ విజన్ వంటి ప్రీమియం విజువల్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్ మీడియాటెక్ Dimensity 7400 5G చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఇది మల్టీ టాస్కింగ్ మరియు గేమింగ్ కోసం కూడా మంచి పెర్ఫార్మెన్స్ అందించే చిప్ సెట్ గా చెబుతారు.

Moto Pad 70 Groove

సౌండ్ విషయానికి వస్తే, ఈ టాబ్లెట్ భారీ స్పీకర్ అండ్ మంచి సౌండ్ టెక్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్ లో 4 ట్వీటర్ లు, 3 ఉఫర్స్ మరియు 2 పాసివ్ రేడియేటర్ తో టోటల్ 9 స్పీకర్లు ఉంటాయి. మరింత ఆకట్టుకునే విషయం ఏమిటంటే ఈ 9 స్పీకర్లు కూడా JBL బ్రాండ్ స్పీకర్లు. ఈ టాబ్లెట్ కలిగిన టోటల్ స్పీకర్ సెటప్ తో 48W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. అంతేకాదు, ఇది 7.2 ఛానల్ ఆడియో ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. అలాగే, డాల్బీ అట్మోస్, Hi-Res Audio మరియు ప్రత్యేకమైన JBL సౌండ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఓవరాల్ గా ఈ టాబ్లెట్ సౌండ్ మాదిరి రూమ్ ఫిల్ సౌండ్ అందిస్తుందని మోటోరోలా తెలిపింది.

Also Read : Pebble Seeq: బడ్జెట్ ధరకే మతి పోగొట్టే ఫీచర్స్ తో AI Smart Glasses వచ్చేసింది.!

ఈ టాబ్లెట్ లో 15 గంటల వీడియో ప్లే బ్యాక్ అందించే 10,200 mAh భారీ బ్యాటరీ ఉంటుంది మరియు ఈ టాబ్ ని వేగంగా ఛార్జ్ చేసే 68W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది. ఇందులో సర్కిల్ టు సెర్చ్ మరియు బిల్ట్ ఇన్ జెమినీ ఏఐ సపోర్ట్ కూడా ఉంది. ఈ టాబ్లెట్ ను బ్లూటూత్ స్పీకర్ గా వాడుకునేలా ఇందులో ప్రత్యేకమైన మోడ్ ను కూడా మోటోరోలా ఇందులో అందించింది. ఈ టాబ్లెట్ వెనుక పెద్ద హోల్డర్ రింగ్ ఉంటుంది. ఇది ఈ టాబ్లెట్ ను నిలబెట్టడానికి మరియు హ్యాంగ్ చేయడానికి కూడా అనువుగా అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile