Poco M8 Power design display and battery features revealed
Poco M8 Power : పోకో ఈసారి M సిరీస్ ఫోన్ ను ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ చూసే ఎవరైనా ఇదే మాట చెబుతారు. అయితే, ఈ ఫోన్ ప్రైస్ రివీల్ చేసిన తర్వాత మాత్రమే ఇది బడ్జెట్ బెస్ట్ ఫోన్ అవుతుందా లేక మిడ్ రేంజ్ ఫోన్ అవుతుందో తెలుస్తుంది. అయితే, ఈ పోకో ఫోన్ డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రం ప్రస్తుతం ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి.
పోకో ఈ ఫోన్ కోసం ప్రత్యేకంగా అందించిన టీజర్ పేజీ నుంచి ఈ అప్ కమింగ్ ఫోన్ కీలక ఫీచర్లు రివీల్ చేసింది. ఇందులో డిజైన్, కెమెరా, డిస్ప్లే మరియు బ్యాటరీ వివరాలు ఉన్నాయి. ముందుగా ఈ ఫోన్ స్క్రీన్ డీటెయిల్స్ చూస్తే, ఈ ఫోన్ 6.9 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 100% DCI-P3 కలర్ గాముట్ వంటి ప్రీమియం ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ స్క్రీన్ వెట్ టచ్ 2.0 TUV Rheinland సర్టిఫికేషన్ కూడా కలిగి ఉంది.
బ్యాటరీ పరంగా, ఈ స్మార్ట్ ఫోన్ మూడు రోజులు పవర్ అందించే 8000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 45W ఫాస్ట్ ఛార్జ్ మరియు 22.5W ఫాస్ట్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన బిగ్ బి బ్యాటరీతో సింగల్ ఫుల్ ఛార్జ్ తో ఏకంగా 28 గంటలు వీడియోలు చూడొచ్చని పోకో చెబుతోంది. ఇది సిలికాన్ కార్బన్ టెక్ తో వచ్చే EV గ్రేడ్ బ్యాటరీ అని కంపెనీ తెలిపింది.
ఇక ఈ ఫోన్ డిజైన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ బిగ్ బ్యాటరీ కలిగి ఉన్నా కూడా ఈ ఫోన్ పరిమాణం కారణంగా స్లీక్ గానే ఉంటుంది. ఈ ఫోన్ వెనుక పెద్ద కెమెరా బంప్ ఉంటుంది. ఈ పెద్ద బంప్ లో డ్యూయల్ రియర్ కెమెరా మరియు నోటిఫికేషన్ లైట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా సెటప్ లో 50MP మెయిన్ కెమెరా ఉంది.
Also Read : Damini : పిడుగుపాటు ముందే పసిగట్టి హెచ్చరిక చేసే యాప్ తెచ్చిన IITM పూణే.!
ఈ పోకో న్యూ స్మార్ట్ ఫోన్ ఆగష్టు 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ను ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు ఈ ఫోన్ టీజర్ పేజీ మరియు టీజింగ్ చేసే వారికి అనిపిస్తుంది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ మరియు ప్రైస్ తో ఈ విషయం క్లియర్ అవుతుంది. అప్పటి వరకు జస్ట్ వైట్ అండ్ వాచ్.