Apple iPhone Air: అత్యంత స్లీక్ ఐఫోన్ వచ్చేసింది.. ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
Apple iPhone Air స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు ఈరోజు లాంచ్ అయ్యింది
ఆపిల్ ఈ ఫోన్ ను అనుకున్న దానికంటే థిన్ డిజైన్ తో లాంచ్ చేసింది
ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ను ఐఫోన్ చరిత్రలో అత్యంత థిన్ ఫోన్ గా లాంచ్ చేసింది
Apple iPhone Air స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు ఈరోజు లాంచ్ అయ్యింది. యాపిల్ నిర్వహించిన బిగ్ ఈవెంట్ నుంచి ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. నిన్నటి వరకు కేవలం రూమర్స్ లో మాత్రమే నిలిచిన ఈ ఫోన్ ఎట్టకేలకు ఇప్పుడు సాక్షాత్కార మయ్యింది. ఆపిల్ ఈ ఫోన్ ను అనుకున్న దానికంటే థిన్ డిజైన్ తో లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ ఐఫోన్ ధర మరియు కంప్లీట్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.
SurveyApple iPhone Air ధర మరియు లభ్యత?
ఈ ఆపిల్ ఐఫోన్ సెప్టెంబర్ 19వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది. సెప్టెంబర్ 12వ తేదీ సాయంత్రం 5:30 నుంచి ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ స్లాట్ ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ ప్రైస్ వివరాలు ఇక్కడ చూడవచ్చు.
ఆపిల్ ఐఫోన్ ఎయిర్ (256 జీబీ) ధర : రూ. 1,19,900
ఆపిల్ ఐఫోన్ ఎయిర్ (512 జీబీ) ధర : రూ. 1,39,900
ఆపిల్ ఐఫోన్ ఎయిర్ (1 టీబీ) ధర : రూ. 1,59,900
ఐఫోన్ ఎయిర్ ఫోన్ స్కై బ్లూ, లైట్ గోల్డ్, క్లౌడ్ వైట్ మరియు స్పేస్ బ్లాక్ నాలుగు రంగుల్లో లభిస్తుంది.
Apple iPhone Air స్పెక్స్ అండ్ ఫీచర్స్ ఏమిటి?
ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ను ఐఫోన్ చరిత్రలో అత్యంత థిన్ ఫోన్ గా లాంచ్ చేసింది. ఈ ఫోన్ చాలా సన్నగా ఉన్నా కూడా గట్టిగా ఉండడానికి వీలుగా టైటానియం ఫ్రేమ్ మరియు సిరామిక్ 2 జతగా మంచి పటిష్టమైన డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ ను కూడా శక్తివంతమైన A19 Pro chip తో లాంచ్ చేసింది. ఇది చాలా పవర్ ఫుల్ చిప్ సెట్ మరియు భారీ 1TB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.5 ఇంచ్ సూపర్ రెటీనా XDR డిస్ప్లే కలిగి ఉంటుంది మరియు ఈ స్క్రీన్ ప్రో మోషన్ టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో వెనుక 48MP ఫ్యూజన్ సింగల్ రియర్ కెమెరా మరియు ముందు 18MP సెంటర్ స్టేజ్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఐఫోన్ సూపర్ హై రిజల్యూషన్ ఫోటోలు మరియు 60 fps 4K Dolby Vision వీడియో సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ జనరేషన్ ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ మరియు 2x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఎమర్జెన్సీ SOS మరియు క్రాష్ డిటెక్షన్ ఫీచర్స్ తో వస్తుంది.
Also Read: Apple iPhone 17 Pro అండ్ 17 Pro Max ధర మరియు కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.!
ఈ ఫోన్ లో USB‑C ఛార్జ్ పోర్ట్, ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 27 గంటల వీడియో ప్లే బ్యాక్ అందించే పవర్ ఫుల్ బ్యాటరీ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫోన్ ఇప్పటి వరకు వచ్చిన ఐఫోన్ లలో విలక్షణమైన డిజైన్ కలిగిన ఫోన్ గా కనిపిస్తుంది మరియు చాలా స్లీక్ గా ఉంటుంది.