వివో పవర్ ఫుల్ ఫోన్ Vivo X200T పై ఫ్లిప్ కార్ట్ సేల్ అద్భుతమైన ఆఫర్స్ అందుకోండి.!

HIGHLIGHTS

వివో పవర్ ఫుల్ ఫోన్ Vivo X200T పై ఫ్లిప్ కార్ట్ సేల్ అద్భుతమైన ఆఫర్స్ అందుకోండి

లేటెస్ట్ పవర్ ఫుల్ కెమెరా ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ SASA LELE సేల్ నుంచి భారీ డిస్కౌంట్ డీల్స్ అందించింది

ఈ ఫోన్ లాంచ్ ధరతో పోలిస్తే ఈరోజు రూ. 15,000 రూపాయల డిస్కౌంట్ తో లభిస్తుంది

వివో పవర్ ఫుల్ ఫోన్ Vivo X200T పై ఫ్లిప్ కార్ట్ సేల్ అద్భుతమైన ఆఫర్స్ అందుకోండి. వివో ఇండియాలో విడుదల చేసిన లేటెస్ట్ పవర్ ఫుల్ కెమెరా ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ డీల్స్ అందించింది. అందుకే, ఈ ఈ ఫోన్ ను అద్భుతమైన ఆఫర్స్ తో అందుకోండి అని ఫ్లిప్ కార్ట్ డీల్ రిలీజ్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ ధరతో పోలిస్తే ఈరోజు రూ. 15,000 రూపాయల డిస్కౌంట్ తో లభిస్తుంది.

Vivo X200T : ఆఫర్

వివో ఎక్స్ 200 టి స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 59,999 బేసిక్ ప్రైస్ తో లాంచ్ అయ్యింది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి కూడా రూ. 54,999 ధరకే సేల్ అవుతోంది. అయితే, ఈ ఫోన్ మూడు గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించింది. మొదటి ఆఫర్ గా ఈ ఫోన్ పై రూ. 5,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ అందించింది. రెండోది ఈ ఫోన్ పై రూ. 5,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ ఆఫర్. మూడవది ఈ ఫోన్ పై అందించిన రూ. 5,000 రూపాయల SBI బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్.

ఫ్లిప్ కార్ట్ సాసా లేలే సేల్ 2026 నుంచి ఈ ఫోన్ పై అందించిన మూడు ఆఫర్స్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 49,999 రూపాయల అతి తక్కువ ధరలో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఈ ఫోన్ అందించిన ఎక్స్ చేంజ్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ లో ఏదైనా ఒకటి మాత్రమే లభిస్తుంది.

Also Read: National Technology Day: భారత సాంకేతిక గురించి ప్రపంచానికి చాటి చెప్పిన రోజు.!

Vivo X200T : ఫీచర్స్

ఈ వివో ప్రీమియం స్మార్ట్ ఫోన్ అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్ మరియు ప్రీమియం గ్లాస్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ 6.67 ఇంచ్ AMOLED స్క్రీన్ ను 5000 నిట్స్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 120Hz రిజల్యూషన్ మరియు HDR10+ వంటి అదనపు ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ వివో ఫోన్ మీడియాటెక్ 3nm చిప్ సెట్ Dimensity 9400+ తో నడుస్తుంది. ఈ ఫోన్ 12 జీబీ LPDDR5X ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

కెమెరా విభాగానికి వస్తే, ఈ ఫోన్ లో 50MP ZEISS మెయిన్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో మరియు 50MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన జబర్దస్త్ కెమెరా ఉంటుంది. ఇది అద్భుతమైన 4K వీడియో రికార్డింగ్, సినిమాటిక్ పోర్ట్రైట్ మరియు లేజర్ ఆటో ఫోకస్ వంటి మరిన్ని గొప్ప కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో సపోర్ట్ కలిగిన 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది.

ఈ వివో ఫోన్ 6200mAh భారీ బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్ లో 90W ఫ్లాష్ ఛార్జ్, 40W వైర్లెస్ ఛార్జ్, బైపాస్ ఛార్జ్ సపోర్ట్ మరియు రివర్స్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా వివో అందించింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :