Flipkart Sale: మోటో G72 ఫోన్ పైన రూ.4,000 భారీ డిస్కౌంట్ అందుకోండి.!

HIGHLIGHTS

మోటరోలా బడ్జెట్ బీస్ట్ స్మార్ట్ ఫోన్ మోటో G72

మోటో G72 ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది

Moto G72 స్మార్ట్ ఫోన్ అఫర్ ధర, ఆఫర్లు మరియు స్పెక్స్ తెలుసుకోండి

Flipkart Sale: మోటో G72 ఫోన్ పైన రూ.4,000 భారీ డిస్కౌంట్ అందుకోండి.!

మోటరోలా బడ్జెట్ బీస్ట్ స్మార్ట్ ఫోన్ మోటో G72 ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. రిపబ్లిక్ డే 2023 సందర్భంగా ప్రకటించిన ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2023 ఈరోజు చివరి రోజు కావడంతో ఈరోజు ఈ భారీ అఫర్ ను అందించింది. 108MP బిగ్ కెమేరా, 120Hz 10బిట్ pOLED డిస్ప్లేని మరియు బ్లోట్ వేర్ ఫ్రీ ఆండ్రాయిడ్ 12 OS వంటి గొప్ప ఫీచర్లను కలిగి వుంటుంది. Moto G72 స్మార్ట్ ఫోన్ అఫర్ ధర, ఆఫర్లు మరియు స్పెక్స్ తెలుసుకోండి.           

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Moto G72: ధర మరియు ఆఫర్స్ 

Moto G72 స్మార్ట్ ఫోన్ రూ.18,999 రూపాయల ధరతో లాంచ్ చెయ్యబడింది మరియు ఇది 6GBర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో వస్తుంది.ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి రూ.4,000 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.14,999 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను Citi  బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్స్ తో కొనేవారికి 10% తగ్గింపు కూడా లభిస్తుంది. 

Moto G72 5G: స్పెక్స్

Moto G72 5G స్మార్ట్ ఫోన్ 6.55 ఇంచ్ FHD+ 10బిట్ pOLED డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR+ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ డిస్ప్లే లో సెల్ఫీ కెమెరా కోసం పైన మధ్య భాగంలో పంచ్ హోల్ వుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G99 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ లను అందిస్తుంది.

కెమెరాల విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమెరాను  వుంది. ఇందులో 108MP ప్రధాన సెన్సార్, 8ఎంపి సెన్సార్  అల్ట్రా-వైడ్ మరియు డెప్త్ కెమెరాగా కూడా పనిచేస్తుంది. చివరిగా, 2MP మ్యాక్రో సెన్సార్ కూడా ఈ సెటప్ ట్లో వుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో ఉన్న పంచ్ హోల్ లో 16MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ పెద్ద 5,000 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది.

ఈ ఫోన్ ఇతర ఫీచర్ల పరంగా, ఈ ఫోన్ బ్లోట్ వేర్ బడెదను లేని లేటెస్ట్ Near-Stock Android 12 OS పైన నడుస్తుంది మరియు IP52 వాటర్ రెపెల్లంట్ డిజైన్ తో వస్తుంది. మంచి ఆడియోను కూడా ఇందులో యూజర్లు పొందుతారు. ఎందుకంటే, ఈ ఫోన్ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో వస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo