POCO X8 Pro: భారీ ఆఫర్స్ తో మొదలైన పోకో లేటెస్ట్ పోకో ఫోన్ సేల్.!
పోకో ఎక్స్ 8 ప్రో స్మార్ట్ ఫోన్ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది
ఈ ఫోన్ ను భారీ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి తీసుకొచ్చింది
ఈ ఫోన్ కేవలం మిడ్ రేంజ్ ధరలో ఆకట్టుకునే ప్రీమియం ఫీచర్లు కలిగి ఉంటుంది
POCO X8 Pro: గతవారం ఇండియన్ మార్కెట్లో పోకో సరి కొత్తగా విడుదల చేసిన పోకో ఎక్స్ 8 ప్రో స్మార్ట్ ఫోన్ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ను భారీ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ కేవలం మిడ్ రేంజ్ ధరలో ఆకట్టుకునే ప్రీమియం ఫీచర్‌లను కలిగి ఉంటుంది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ప్రైస్, ఆఫర్స్ మరియు పూర్తి ఫీచర్స్ తెలుసుకోండి.
SurveyPOCO X8 Pro: ప్రైస్ అండ్ ఆఫర్స్
పోకో ఈ స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ మరియు వైట్ మూడు రంగుల్లో లభిస్తుంది.
- పోకో X8 ప్రో (8 జీబీ + 128 జీబీ) ప్రైస్ : రూ. 32,999
- పోకో X8 ప్రో (12 జీబీ + 256 జీబీ) ప్రైస్ : రూ. 35,999

ఈ లేటెస్ట్ పోకో స్మార్ట్ ఫోన్ పై రెండు జబర్దస్త్ ఆఫర్లు అందించింది. ఈ ఫోన్ ను SBI, HDFC, మరియు ICICI కార్డు లతో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 3,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను ఈ ఫోన్ పై అందించింది. ఇది కాకుండా ఈ ఫోన్ పై రూ. 1,200 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను మరింత తక్కువ ధరలో అందుకోవచ్చు.
Also Read: Vivo V70 FE : భారీ 200MP కెమెరాతో కొత్త ఫోన్ అనౌన్స్ చేసిన వివో.!
POCO X8 Pro: ఫీచర్స్
ఈ పోకో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 6.59 ఇంచ్ కాంపాక్ట్ సైజు కలిగిన AMOLED స్క్రీన్ తో వస్తుంది. ఇందులో ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్, 3500 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ మరియు వస్తుంది డాల్బీ విజన్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
ఇందులో మీడియాటెక్ Dimensity 8500 ప్రోసెసర్ ని అందించింది మరియు దానికి జతగా 12GB LPDDR5 ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా అందించింది. ఈ ఫోన్ 23,00,000 కంటే ఎక్కువ AnTuTu స్కోర్ తో గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ కలిగిన డిస్ప్లే మరియు ప్రోసెసర్ శక్తితో BGMI మరియు COD వంటి 20 కి పైగా హెవీ గేమ్స్ ను 120FPS వద్ద ప్లే చేయడానికి సపోర్ట్ చేస్తుందని కూడా పోకో తెలిపింది.
ఇక ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే, పోకో X8 ప్రో 50MP మెయిన్ కెమెరా జతగా 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ తో డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ కెమెరా పై కొత్తగా డైనమిక్ RGB లైట్స్ ను కూడా ఆకర్షణ కోసం పోకో అందించింది. అలాగే. ఫోన్ లో ముందు 20MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ స్టేబుల్ 4K వీడియో మరియు AI కెమెరా ఫీచర్స్ తో గొప్ప ఫోటోలు మరియు వీడియోలు అందిస్తుంది.
ఈ ఫోన్ 6500 mAh బిగ్ బ్యాటరీని 100W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఈ ఫోన్ లో 27W రివర్స్ ఛార్జ్ మరియు బైపాస్ ఛార్జ్ సపోర్ట్ కూడా పోకో అందించింది. ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన IP69 మరియు IP69 రేటింగ్ తో గొప్ప వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫోన్ గా ఉంటుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile