నథింగ్ లేటెస్ట్ బడ్జెట్ 5G ఫోన్ CMF Phone 1 పైన ఫ్లిప్ కార్ట్ జబర్దస్త్ ఆఫర్.!
CMF Phone 1 పై ఫ్లిప్ కార్ట్ జబర్దస్త్ ఆఫర్ అందించింది
ఈ ఫోన్ 4K వీడియో రికార్డ్ చేసే Sony కెమెరాతో వస్తుంది
ఈ ఫోన్ ను కేవలం రూ. 12,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు
నథింగ్ సబ్ బ్రాండ్ CMF భారత మార్కెట్లో ఇటీవల సరికొత్తగా లాంచ్ చేసిన CMF Phone 1 పై ఫ్లిప్ కార్ట్ జబర్దస్త్ ఆఫర్ అందించింది. సరికొత్త డిజైన్ మరియు ఆకట్టుకునే ఫీచర్స్ తో వచ్చిన ఈ ఫోన్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి చాలా చవక ధరలో అందుకునే అవకాశం వుంది. ఈ ఫోన్ వేగవంతమైన ప్రోసెసర్, 4K వీడియో రికార్డ్ చేసే Sony కెమెరా మరియు లాంగ్ బ్యాటరీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈ ఫోన్ ను కేవలం రూ. 12,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు.
SurveyCMF Phone 1 : ఆఫర్
నథింగ్ సబ్ బ్రాండ్ CMF రీసెంట్ గా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 15,999 స్టార్టింగ్ ప్రైస్ తో లాంచ్ అయ్యింది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈ రోజు ఈ ఫోన్ రూ. 1,000 రూపాయల డిస్కౌంట్ తో రూ. 14,999 ధరతో సేల్ అవుతోంది. ఇది జబర్దస్త్ ఆఫర్ ఏమిటా బాబు? అనుకోకండి. ఈ ఫోన్ పైన ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ నుంచి ఈ ఫోన్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ను అందించింది.
అదేమిటంటే, CMF ఫోన్ 1 పై ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 2,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ తో ఈ ఫోన్ ను కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్ తో ఈ నథింగ్ ఫోన్ కేవలం రూ. 12,999 ధరకే లభిస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ నిజంగానే గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read: నమ్మశక్యం కానీ ఆఫర్: రూ. 3,999 కే 120W పవర్ ఫుల్ Soundbar అందుకోండి.!
CMF Phone 1 : ఫీచర్స్
ఈ ఫోన్ FHD+ రిజల్యూషన్ మరియు HDR 10+ సపోర్ట్ కలిగిన 6.67 ఇంచ్ Super AMOLED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300 5G చిప్ సెట్, 6GB ఫిజికల్ ర్యామ్, 8GB ర్యామ్ బూస్టర్ సపోర్ట్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మల్టి టాస్కింగ్ మరియు గేమింగ్ కి కూడా అనువుగా ఉంటుంది.

ఈ ఫోన్ లో 50MP Sony ప్రధాన సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 30 fps వద్ద 4K వీడియోలు మరియు మంచి క్వాలిటీ ఫోటోలు అందిస్తుంది. ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జ్ మరియు 5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile