vivo V60 5G స్మార్ట్ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ డీల్స్ అందించింది. వివో వి సిరీస్ నుంచి ప్రీమియం ఫీచర్లతో విడుదల చేసిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన డిస్కౌంట్ ఆఫర్స్ తో మిడ్ రేంజ్ బడ్జెట్లోనే లభిస్తుంది. ఈ ఫోన్ ట్రిపుల్ 50MP కెమెరాలు మరియు 6500 mAh బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ తో ఈ ఫోన్ వచ్చింది మరియు ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఆఫర్స్ తో మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.తెలుగు
Survey
✅ Thank you for completing the survey!
vivo V60 5G : ఆఫర్స్
వివో వి60 స్మార్ట్ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ రెండు భారీ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ రూ. 38,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు ఇదే ప్రైస్ తో ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతోంది. అయితే, ఈ ఫోన్ పై రూ. 3,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్ మరియు సెలెక్టెడ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ పై రూ. 3,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది.
అంటే, ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ ఫోన్ పై రూ. 6,000 రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ రెండు ఆఫర్స్ అందుకుంటే ఈ ఫోన్ ను కేవలం రూ. 32,999 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చు.
ఈ వివో స్మార్ట్ ఫోన్ 7.65mm మందంతో చాలా స్లీకా ఉంటుంది మరియు 200 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుంది. ఈ ఫోన్ 6.77 ఇంచ్ స్క్రీన్ ని 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7 Gen 4 చిప్ సెట్ తో నడుస్తుంది. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
వివో వి60 స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో, 50MP ZEISS OIS మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ మరియు 50MP ZEISS టెలిఫోటో కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఫోన్ లో 4K వీడియో సపోర్ట్ కలిగిన 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ ఫన్ టచ్ OS 15 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 15 OS ఫై నడుస్తుంది.