PAN – Aadhaar Link: ఆన్లైన్ లో సొంతంగా ఆధార్ పాన్ లింక్ చేసుకోండి.!

HIGHLIGHTS

ఫైనాన్షియల్ పనులకు ముఖ్యమైన పాన్ కార్డ్ ను విధిగా ఆధార్ కార్డ్ తో లింక్ చేయాలి

పాన్ కార్డ్ చెల్లుబాటులో లేకుండా డీ యాక్టివ్ చేయబడుతుంది

మీరే ఆన్లైన్ సొంతంగా ఆధార్ పాన్ లింక్ చేసుకోవడానికి కూడా వీలుంది

PAN – Aadhaar Link: ఆన్లైన్ లో సొంతంగా ఆధార్ పాన్ లింక్ చేసుకోండి.!

PAN – Aadhaar Link: ఫైనాన్షియల్ పనులకు ముఖ్యమైన పాన్ కార్డ్ ను విధిగా ఆధార్ కార్డ్ తో లింక్ చేయాలి. లేకుంటే పాన్ కార్డ్ చెల్లుబాటులో లేకుండా డీ యాక్టివ్ చేయబడుతుంది. ఇది నేను చెబుతున్న మాటకాదు, ప్రభుత్వం ఇచ్చిన అల్టిమేటం. 2025 డిసెంబర్ 31వ తేదీ ముగిసే లోపు పాన్ ఆధార్ లింక్ చేయకపోతే ఆ పాన్ కార్డు చెల్లుబాటు అవ్వకుండా హోల్డ్ చేయబడుతుంది. మీరు ఇప్పటికే ఆధార్ పాన్ లింక్ చేసి ఉంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ అలా చేయకుంటే త్వరగా చేయండి. మీరే ఆన్‌లైన్ సొంతంగా ఆధార్ పాన్ లింక్ చేసుకోవడానికి కూడా వీలుంది. ఇది ఎలా చేయాలో ఇక్కడ వివరంగా అందించాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ముందు మీ పాన్ ఆధార్ లింక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది కాబట్టి, ఆన్లైన్ లో చెక్ చేయండి. ప్రభుత్వ ఇన్‌కమ్ టాక్స్ సైట్ www.incometax.gov.in/iec/foportal ద్వారా మీరు మీ లింక్ స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు. దీనికోసం పైన తెలిపి ఇన్‌కమ్ టాక్స్ సైట్ ఓపెన్ చేసి Quick Links మెనూ చివరిలో కనిపించే లింక్ ఆధార్ స్టేటస్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లింక్ స్టేటస్ కోసం చెకింగ్ కోసం పాన్ కార్డు మరియు ఆధార్ నెంబర్ అడుగుతూ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

PAN - Aadhaar Link

ఈ కొత్త పేజీలో అడిగిన వద్ద పాన్ మరియు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అడుగున కనిపించే వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ బాక్స్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ పాన్ మరియు ఆధార్ లింక్ స్టేటస్ తెలియ చేయబడుతుంది. ఇందులో మీ స్టేటస్ లింక్ చేయకుండా ఉంటే మీరు ఇప్పుడు లింక్ చేయాల్సి ఉంటుంది.

Also Read: VU GloQLED స్మార్ట్ టీవీ పై అమెజాన్ బిగ్ డీల్ అందుకోండి.!

పాన్ ఆధార్ కార్డు లింక్ ని మీరే స్వయంగా నిర్వహించే అవకాశం ప్రభుత్వం అందించింది. దీనికోసం పైన తెలిపిన సైట్ ఓపెన్ చేసి క్విక్ లింక్స్ లో అడుగున లింక్ ఆధార్ స్టేటస్ ట్యాబ్ క్రింద ఉన్న ‘Link Aadhar’ క్లిక్ చేయండి మరియు మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇది మీకు ఆధార్ మరియు పాన్ నెంబర్ నమోదు చేయడానికి రెండు బాక్స్ లు ఉంటాయి. ఇక్కడ అడిగిన వద్ద మీ పాన్ మరియు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వాలి డేట్ చేయండి. ఇక్కడ ఈ సైట్ మీ ఆధార్ మరియు పాన్ వివరాలు (పేరు) సరిగా ఉన్నా లేదో చెక్ చేస్తుంది.

మీరు అందించిన వివరాలు సరిగ్గా ఉంటే మీరు పేమెంట్ పేజీ కి మల్లించ బడతారు. ఇక్కడ వివరాలు అందించి పేమెంట్ అందిస్తే మీ పాన్ మరియు ఆధార్ లింక్ ప్రాసెస్ ని పూర్తి చేస్తుంది. ఒకవేళ మీ ఆధార్ మరియు పాన్ కార్డ్ లో పేరు లేదా పుట్టిన తేదీ వంటి వివరాలు తప్పుగా ఉంటే మీరు తప్పుగా ఉన్న వివరాలు ముందుగా సరి చేసుకోవాలి మరియు ఆ తర్వాత ఈ లింక్ ప్రాసెస్ చేయాలి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo