సేల్ ముగిసిన తర్వాత కూడా MOTOROLA G86 Power 5G పై భారీ డిస్కౌంట్ అందుకోండి.!
MOTOROLA G86 Power 5G స్మార్ట్ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ భారీ డీల్స్ అందించింది
మోటోరోలా యొక్క లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ జబర్దస్త్ డీల్స్ అందించింది
దీపావళి సేల్ తర్వాత కూడా ఫ్లిప్ కార్ట్ ఈరోజు బెస్ట్ డీల్స్ అందించింది
MOTOROLA G86 Power 5G స్మార్ట్ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ భారీ డీల్స్ అందించింది. దీపావళి పండుగ సేల్ ముగిసిన వెంటనే ఆఫర్లు కూడా ముగుస్తాయని అందరూ అనుకుంటుండగా, ఫ్లిప్ కార్ట్ మాత్రం ఈ మోటోరోలా యొక్క లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పై జబర్దస్త్ డీల్స్ అందించింది. లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన కొత్త ఫోన్ ను బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం దీపావళి సేల్ తర్వాత కూడా ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించింది.
SurveyMOTOROLA G86 Power 5G : ఆఫర్
మోటోరోలా జి86 పవర్ స్మార్ట్ ఫోన్ ఇటీవలే ఇండియాలో లాంచ్ అయ్యింది. మోటోరోలా ఈ ఫోన్ ను కేవలం రూ. 17,999 ప్రారంభ ధరతో మంచి ఫీచర్స్ తో లాంచ్ చేసింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 2,000 డిస్కౌంట్ తో కేవలం రూ. 15,999 ధరకే సేల్ అవుతోంది. దీనికి తోడు ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ మరియు రూ. 1,000 రూపాయల సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్ EMI డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.

పైన తెలిపిన అన్ని ఆఫర్స్ అందుకుంటే ఈ లేటెస్ట్ మోటోరోలా స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 13,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ లాంచ్ ప్రైస్ తో పోలిస్తే ఈ స్మార్ట్ ఫోన్ ఏకంగా రూ. 4,000 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.
Also Read: రీఛార్జ్ కొట్టు డిస్కౌంట్ పట్టు అంటున్న BSNL
MOTOROLA G86 Power 5G : ఫీచర్స్
మోటోరోలా జి86 పవర్ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం లభిస్తున్న ఆఫర్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ మరియు ప్రీమియం వేగాన్ లెథర్ బ్యాక్ తో ఉంటుంది. ఈ ఫోన్ 61.5K సూపర్ HD రిజల్యూషన్ కలిగిన 6.67 ఇంచ్ pOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 4500 నిట్స్ పీక్ లోకల్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ పవర్ ఫుల్ చిప్ సెట్ గా పేరొందిన Dimensity 7400 తో పని చేస్తుంది. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ తో వస్తుంది.
కెమెరా పరంగా, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో, 50MP (Sony LYTIA 600) మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 3-in-1 ఫ్లికర్ సెన్సార్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ 32MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ మరియు AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ భారీ 6720 mAh బ్యాటరీ మరియు 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కలిగిన స్టీరియో స్పీకర్లు మరియు IP68 + IP69 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో కూడా ఉంటుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile