రీఛార్జ్ కొట్టు డిస్కౌంట్ పట్టు అంటున్న BSNL

HIGHLIGHTS

BSNL యూజర్ల కోసం ప్రభుత్వ టెలికాం కొత్త రీఛార్జ్ కొట్టు డిస్కౌంట్ పట్టు ఆఫర్ తెచ్చింది

దీపావళి పండుగ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన చాలా ఆఫర్స్ లో ఇది ఒకటి

బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ రీఛార్జ్ చేసే యూజర్లకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది

రీఛార్జ్ కొట్టు డిస్కౌంట్ పట్టు అంటున్న BSNL

BSNL యూజర్ల కోసం ప్రభుత్వ టెలికాం కొత్త రీఛార్జ్ కొట్టు డిస్కౌంట్ పట్టు ఆఫర్ తెచ్చింది. ఆఫ్ కోర్స్, ఈ ఆఫర్ పేరు ఇది కాదనుకోండి, కానీ ఈ ఆఫర్ విధానం మాత్రమే అదే అవుతుంది. అదేమిటంటే, దీపావళి పండుగ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన చాలా ఆఫర్స్ లో ఇది ఒకటి. ఈ ఆఫర్స్ తో బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ రీఛార్జ్ చేసే యూజర్లకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BSNL అందించిన ఈ ఆఫర్ ఏమిటి?

బీఎస్ఎన్ఎల్ అక్టోబర్ 18న ఈ ఆఫర్ ని అనౌన్స్ చేసింది మరియు ఈ ఆఫర్ అక్టోబర్ 8 నుంచి నవంబర్ 18వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. అంటే, ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మరియు యూజర్లకు ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ అందుకోవడానికి బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా ప్లాన్స్ రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది.

అంటే, మీరు బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా ఏ బీఎస్ఎన్ఎల్ యూజర్ కోసం రీఛార్జ్ చేసినా మీకు 2.5% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అయితే, రూ. 199 రూపాయల పై బడిన ప్లాన్ రీఛార్జ్ పై మాత్రమే ఈ అదనపు ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

BSNL New Offer

ఇది కాకుండా మరిన్ని అదనపు ప్రయోజనాలు అందించే మరిన్ని ప్లాన్స్ కూడా అందించింది. ఇందులో సీనియర్ సిటిజన్ కోసం అందించిన ఆఫర్ కూడా ఒకటి ఉంది. అదే బీఎస్ఎన్ఎల్ సమ్మాన్ ప్లాన్ మరియు ఈ ప్లాన్ ను కేవలం రూ. 1,812 రూపాయల ఆఫర్ ధరకే అందించింది. ఈ చవక ప్రీపెయిడ్ ప్లాన్ సీనియర్ సిటిజన్లకు సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది.

Also Read: iQOO 15 ఇండియా లాంచ్ మరియు ఫీచర్స్ అనౌన్స్ చేసిన ఐకూ.!

బీఎస్ఎన్ఎల్ సమ్మాన్ ప్లాన్ ప్రయోజనాలు

బీఎస్ఎన్ఎల్ సమ్మాన్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 365 రోజుల వ్యాలిడిటీ ఆఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే సీనియర్ సిటిజన్స్ కి సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2 జీబీ హై స్పీడ్ డేటా మరియు డైలీ 100SMS ప్రయోజనం కూడా అందిస్తుంది. ఇది మాత్రమే కాదు 6 నెలల BiTV సబ్ స్క్రిప్షన్ కూడా ఈ ప్లాన్ తో అందిస్తుంది.

అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందుకోవడానికి కొన్ని షరతులు ఉన్నాయి. ఈ ఆఫర్ ప్లాన్ అందుకోవాలంటే కొత్త సిమ్ కార్డు తీసుకునే సీనియర్ సిటిజన్స్ కి మాత్రమే వర్తిస్తుంది. ఇది లిమిటెడ్ పీరియడ్ ప్లాన్ మరియు కేవలం అక్టోబర్ 18 నుంచి నవంబర్ 18వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ మధ్య కాలంలో రీఛార్జ్ చేసే కొత్త సీనియర్ సిటిజన్స్ కి మాత్రమే ఈ ప్లాన్ వర్తిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo