iPhone 15 పై Flipkart జబర్దస్త్ అఫర్: 15 వేల డిస్కౌంట్ తో ఐఫోన్ 15 అందుకోండి.!
iPhone 15 పై Flipkart జబర్దస్త్ అఫర్ ప్రకటించింది
రూ. 15,000 భారీ డిస్కౌంట్ తో iPhone ను ఆఫర్ ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది
ఫ్లిప్ కార్ట్ అందించిన ఆఫర్లు మరియు ఫోన్ ఫీచర్స్ పై ఒక లుక్కేయండి
iPhone 15 పై Flipkart జబర్దస్త్ అఫర్ ప్రకటించింది. ఐఫోన్ కావాలని ఎదురు చూస్తున్న వారికి ఈరోజు గొప్ప శుభవార్త ఫ్లిప్ కార్ట్ అందించింది. ఐఫోన్ లేటెస్ట్ సిరీస్ బేసిక్ ఫోన్ అయిన ఐఫోన్ 15 ను ఈరోజు రూ. 15,000 భారీ డిస్కౌంట్ తో డిస్కౌంట్ ధరకే ఆఫర్ ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 15 డిస్కౌంట్ ఆఫర్ తో కొనాలని ఎదురు చూసే వారిలో మీరు ఉన్నట్లయితే, ఫ్లిప్ కార్ట్ అందించిన ఆఫర్లు మరియు ఫోన్ ఫీచర్స్ పై ఒక లుక్కేయండి.
SurveyFlipkart అందించిన iPhone 15 ఆఫర్ ఏమిటి?
ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఐఫోన్ 15 ను రూ. 15,000 భారీ డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. ఇండియాలో రూ. 79,999 రూపాయల స్టార్టింగ్ ప్రైస్ తో ఈ ఫోన్ వచ్చింది. ఈరోజు ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుండి డిస్కౌంట్ ఆఫర్ తో రూ. 64,999 రూపాయల ధరకే లభిస్తోంది. అంతేకాదు, HDFC Bank Credit Card Non EMI ఆప్షన్ తో ఈ ఫోన్ ను కొనుగోలు చేసే యూజర్లు రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. అంటే, ఈ ఫోన్ ను మరింత తక్కువ ధరకే అందుకునే వీలుంది.
Also Read: Realme GT6: రియల్ మీ మొదటి AI ఫ్లాగ్ షిప్ కిల్లర్ ఫోన్ వచ్చేస్తోంది.!
iPhone 15 : ఫీచర్లు
ఐఫోన్ 15 ఫోన్ 6.1 ఇంచ్ సూపర్ రెటీనా XDR డిస్ప్లే తో వస్తుంది. ఈ డిస్ప్లే డైనమిక్ ఐల్యాండ్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు ట్రూ టోన్ తో వస్తుంది. ఈ ఫోన్ యాపిల్ లేటెస్ట్ A16 బయోనిక్ చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 128GB, 256GB మరియు 512GB స్టోరేజ్ ఆప్షన్ లలో లభిస్తుంది. మీ అభిరుచికి అనుగుణంగా బ్లాక్, బ్లూ, గ్రీన్, ఎల్లో మరియు పింక్ కలర్ లలో మీకు నచ్చిన కలర్ ఎంచుకోవచ్చు.

ఐఫోన్ 15 లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 48MP మెయిన్ + 12MP అల్ట్రా వైడ్ / టెలి ఫోటో కెమెరాలు ఉంటాయి. ఈ ఫోన్ కెమెరాతో టన్నుల కొద్దీ ఫీచర్లు మరియు ఫిల్టర్లు ఉంటాయి. ఐఫోన్ 15 ఫోన్ 24fps మొదలుకొని 60fps 4K వీడియోల కోసం సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 4K వీడియో సపోర్ట్ కలిగిన 12MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ Dolby Atmos ఆడియో సపోర్ట్ తో వస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile