చివరి రోజు అఫర్: 5 వేలకే రివర్స్ ఛార్జింగ్ స్మార్ట్ ఫోన్

HIGHLIGHTS

5 వేలకే పెద్ద స్క్రీన్ రివర్స్ ఛార్జింగ్ స్మార్ట్ ఫోన్

EMI అప్షన్ తో కొనేవారికి 12% అధనపు తగ్గింపు లభిస్తుంది

Gionee Max ఇప్పుడు Flipkart సేల్ నుండి మరింత తక్కువ ధరకే లభిస్తోంది

చివరి రోజు అఫర్: 5 వేలకే రివర్స్ ఛార్జింగ్ స్మార్ట్ ఫోన్

చివరి రోజు అఫర్: 5 వేలకే పెద్ద స్క్రీన్ రివర్స్ ఛార్జింగ్ స్మార్ట్ ఫోన్ పొందాలనుకుంటే మాత్రం ఈ ఆఫర్ మిస్సవ్వకండి. ఇండియాలో చాలా తక్కువ ధరకే జియోనీ ప్రవేశపెట్టిన Gionee Max ఇప్పుడు Flipkart సేల్ నుండి మరింత తక్కువ ధరకే లభిస్తోంది. అంతేకాదు, బ్యాంక్ అఫర్, EMI అఫర్ తో కొనాలనుకుంటే చాలా తక్కువ EMI తో ఈ ఫోన్ ను తీసుకోవచ్చు. కేవలం రూ.5,499 రూపాయల ధరకే లభిస్తున్న ఈ ఫోన్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు మరియు EMI అప్షన్ తో కొనేవారికి 10% అధనపు తగ్గింపు లభిస్తుంది.                           

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Gionee Max: అఫర్ ధర

జియోనీ మాక్స్ 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ తో తీసుకురాబడింది మరియు దీని ప్రస్తుత అఫర్ ధర రూ .5,499. ఈ ఫోన్ బ్లాక్, రెడ్ మరియు రాయల్ బ్లూ వంటి మూడు రంగులలో ప్రవేశపెట్టబడింది.

Gionee Max: స్పెసిఫికేషన్

ఈ జియోనీ మాక్స్ ఆండ్రాయిడ్ 10 లో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ లో 6.1-అంగుళాల హెచ్‌డి + డిస్ప్లే ఉంది, దీనికి 2.5 డి కర్వ్డ్ గ్లాస్ స్క్రీన్ రక్షణ ఇవ్వబడింది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ Unisoc 9863A SoC శక్తిని కలిగి ఉంది మరియు 2GB RAM తో జత చేయబడింది. ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా అందించబడింది, దీనిలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది.

జియోనీ మాక్స్ 32 జిబి స్టోరేజ్ కలిగి ఉంది, దీనిని మైక్రో ఎస్డి కార్డ్ నుండి 256 జిబి వరకు పెంచవచ్చు. ఈ ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది మరియు ఇది రివర్స్ ఛార్జింగ్ కి మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ కోసం, జియోనీ మాక్స్ 4 జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ 4.2, జిపిఎస్ / ఎ-జిపిఎస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ మరియు మైక్రో యుఎస్‌బి పోర్ట్‌ను కలిగి ఉంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile