Google Pixel 8 ఫోన్ పై భారీ భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన Flipkart Big Shopping Utsav సేల్.!

HIGHLIGHTS

Google Pixel 8 ఈరోజు భారీ డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే లభిస్తోంది

ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే గూగుల్ పిక్సెల్ లేటెస్ట్ ఫోన్ ను మీ సొంతం చేసుకోవచ్చు

ఫ్లిప్ కార్ట్ ఈరోజు నుంచి ప్రారంభించిన బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ ను ఆఫర్ చేస్తోంది

Google Pixel 8 ఫోన్ పై భారీ భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన Flipkart Big Shopping Utsav సేల్.!

Google Pixel 8 స్మార్ట్ ఫోన్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే లభిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే గూగుల్ పిక్సెల్ లేటెస్ట్ ఫోన్ ను మీ సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ ఈరోజు నుంచి ప్రారంభించిన బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ నుంచి ఈ బిగ్ డీల్ ను ఆఫర్ చేస్తోంది. గూగుల్ ఫోన్ ను తక్కువ ధరలో కొనాలని సేల్ ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇదే సరైన సమయం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Flipkart Big Shopping Utsav : ఆఫర్

ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ నుంచి ఈరోజు గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ మంచి డిస్కౌంట్ ధరకు లభిస్తుంది. ఇక ఆఫర్ విషయానికి వస్తే, గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 48% డిస్కౌంట్ తో కేవలం రూ. 38,999 ఆఫర్ ధరకు లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ పై మరో రెండు ఆఫర్స్ ను కూడా ఫ్లిప్ కార్ట్ అందిం అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ గూగుల్ ఫోన్ 34 వేల రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది.

గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్ ఫోన్ ను ICICI Bank క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 4,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ ఆఫర్ తో కొనుగోలు చేసే యూజర్లకు ఈ గూగుల్ కేవలం రూ. 34,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది.

Also Read: Samsung Galaxy A16 5G ఫోన్ ను 6 సంవత్సరాల OS అప్గ్రేడ్ తో లాంచ్ చేయబోతున్న శామ్సంగ్.!

Google Pixel 8 : ఫీచర్స్

2023 లో వచ్చిన బెస్ట్ ప్రీమియం ఫోన్ లలో ఒకటైన గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్ ఫోన్ గొప్ప ఫీచర్స్ కలిగివుంది. ఈ ఫోన్ లో 6.2 ఇంచ్ స్క్రీన్ వుంది మరియు ఇది FHD + రిజల్యూషన్ కలిగిన OLED. ఈ స్క్రీన్ 24 Bit ప్యానల్ మరియు ఇది గొప్ప కలర్స్ అందిస్తుంది. ఈ స్క్రీన్ 60 – 120Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR సపోర్ట్ తో పాటు 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ తో వస్తుంది.

Flipkart Big Shopping Utsav offers Google Pixel 8 smartphone

ఈ గూగుల్ ఫోన్ గూగుల్ యొక్క లేటెస్ట్ Tensor G3 చిప్ సెట్ మరియు Titan M2 సెక్యూరిటీ చిప్ సెట్ తో వస్తుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను 50MP + 12MP డ్యూయల్ రియర్ మరియు 10.5 MP సెల్ఫీ కెమెరాలతో గూగుల్ అందించింది. ఈ ఫోన్ కెమెరాతో అద్భుతమైన ఫోటోలు మరియు 60fps వద్ద 4K వీడియోలు కూడా పొందవచ్చు. ఈ ఫోన్ 4575 mAh బ్యాటరీని ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile