Flipkart Big Saving Days Sale: బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్

Flipkart Big Saving Days Sale: బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్
HIGHLIGHTS

బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్ అందుకోండి

Realme 7 Pro భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది

Flipkart Big Saving Days Sale బెస్ట్ స్మార్ట్ ఫోన్ అఫర్

Flipkart Big Saving Days Sale నుండి బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్ అందుకోండి. రియల్మి నుండి అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో కేవలం మిడ్ రేంజ్ ధరలో వచ్చిన Realme 7 Pro ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. Realme 7 Pro స్మార్ట్ ఫోన్ 65W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఈ సేల్ నుండి కేవలం బడ్జెట్ ధరకే వస్తుంది. అంతేకాదు,శక్తివంతమైన క్వాల్కమ్ ప్రాసెసర్ నుండి మొదలుకొని Sony 64MP క్వాడ్ కెమెరాల వరకూ చాలా మంచి ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ సొంతం. అటువంటి, ఈ స్మార్ట్ ఫోన్ Flipkart Big Saving Days Sale నుండి 4,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది.

అధనంగా, SBI బ్యాంక్ 10% తగ్గింపు అఫర్ కూడా అఫర్ చేస్తోంది.   

Realme 7 Pro: అఫర్ ధర (Buy Here)

రియల్ మీ 7 ప్రో బేస్ వేరియంట్‌ అయిన 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ .19,999 ధరలో వచ్చింది. అయితే, ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి కేవలం రూ.15,999 రూపాయలకే లభిస్తోంది. మరొక 8 జీబీ + 128 జీబీ వేరియంట్‌ ను రూ .21,999 ధరలో విడుదల చేసింది. ఈ ఫోన్ కూడా కేవలం రూ.17,999 రూపాయలకే లభిస్తోంది. రియల్ మీ 7 ప్రో రెండు రంగులలో వస్తుంది – మిర్రర్ బ్లూ మరియు మిర్రర్ సిల్వర్ రంగులలో లభిస్తుంది.

రియల్ మీ 7 ప్రో ప్రత్యేకతలు

రియల్ మీ 7 ప్రో లో 6.4-అంగుళాల పూర్తి HD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్‌ప్లే ఉంది, ఇది సూపర్ అమోలేడ్ ప్యానెల్‌ మరియు సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్‌తో వస్తుంది. ఈ స్క్రీన్‌లో వేలిముద్ర రీడర్ కూడా ఉంది. ఈ ఫోన్ మందం 8.7 మిల్లీమీటర్లు మరియు 182 గ్రాముల బరువు ఉంటుంది.

రియల్ మీ 7 ప్రో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720 జి ప్రాసెసర్ ‌తో ఆక్టా-కోర్ సిపియు మరియు అడ్రినో 618 జిపియుతో పనిచేస్తుంది. ఇది 6GB / 8GB వరకు LPDDR4x RAM మరియు 128GB / 256GB UFS 2.1 స్టోరేజ్ ఎంపికలతో జతచేయబడుతుంది. మైక్రో SD కార్డ్ ఉపయోగించి స్టోరేన్ మరింత విస్తరించడానికి  ఎంపిక ఉంది. రియల్ మీ 7 ప్రో ఆండ్రాయిడ్ 10 ఆధారంగా Realme UI ‌లో నడుస్తుంది.

కెమెరాల విషయానికి వస్తే, రియల్ మీ 7 ప్రో వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌తో వస్తుంది, దీనిలో ఎఫ్ / 1.8 ఎపర్చరు ప్రాధమిక 64MP Sony IMX682 సెన్సార్ , 8 ఎంపి అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా 119-డిగ్రీల ఫీల్డ్-ఆఫ్- వీక్షణ, 2MP పోర్ట్రెయిట్ కెమెరా మరియు 2MP మ్యాక్రో కెమెరాతో వస్తుంది. ముందు వైపు, 85 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో 32 MP సెల్ఫీ కెమెరా ఉంది. వెనుక కెమెరాలు 4K UHD లో 30FPS వద్ద మరియు పూర్తి HD 120FPS వద్ద రికార్డ్ చేయగలవు, EIS తో మద్దతు కూడా వుంది.

రియల్ మీ 7 ప్రో లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది, ఇది అవుట్-ఆఫ్-ది బాక్స్ 65W ఫాస్ట్ ఛార్జింగ్ ‌కు మద్దతు ఇస్తుంది.  కేవలం 34 నిమిషాలలో 0-100% నుండి పూర్తిగా 7 Pro స్మార్ట్ ఫోన్ ఛార్జ్ చేయవచ్చని రియల్ మీ పేర్కొంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo