Flipkart Big Billion Days sale 2026 date announced
Flipkart Big Billion Days sale డేట్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది. 2026 విజయదశమి పండుగ సందర్భంగా ఈ అప్ కమింగ్ సేల్ ను అనౌన్స్ చేసింది. అంటే, దసరా పండుగ 2026 ని పురస్కరించుకుని ఈ బిగ్ సేల్ ని ఫ్లిప్ కార్ట్ అందించింది. గత సంవత్సరం ఈ సేల్ నుంచి డీల్స్ అందించింది. 2026 పండుగ సేల్ నుంచి కూడా ఇదే పరంపర కొనసాగిస్తుందని చెబుతోంది. ఈ అప్ కమింగ్ బిగ్ ఫెస్టివల్ సేల్ డేట్ అండ్ ఆఫర్స్ పై ఒక లుక్కేద్దామా.
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 అక్టోబర్ 8వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. దసరా పండుగ అక్టోబర్ 11వ తేదీ జరుపుకుంటారు కాబట్టి ఈ సేల్ నుంచి మూడు రోజులు ముందుగానే స్టార్ట్ అవుతుంది. ఈ సేల్ నుంచి ఫ్లిప్ కార్ట్ గొప్ప డీల్స్ అండ్ ఆఫర్స్ అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా, కొత్త ఐఫోన్ లాంచ్ తర్వాత ఈ ఫోన్ వస్తుంది కాబట్టి, ఐఫోన్ రేట్లు గురించి ఈ సేల్ పెద్ద టాపిక్ గా మారే అవకాశం అవకాశం ఉంది.
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 నుంచి అనేక ప్రొడక్ట్స్ పై గొప్ప డీల్స్ ని మనం ఆశించవచ్చు. ఎందుకంటే, ఇది ఇండియాలో జరుపుకునే పెద్ద పండుగలలో ఒకటి మరియు దక్షిణ రాష్ట్రాలలో ఈ పండుగ సందర్భంగా ఏదైనా ఒక వస్తువు కొనుగోలు చేయడం శుభసూచకంగా భావిస్తారు. అందుకే, ఈ సేల్ లో మంచి డాల్స్ ఆఫర్లు లభించే అవకాశం ఉంటుంది.
ఈ సేల్ నుంచి లేటెస్ట్ సౌండ్ బార్, స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్, వాషింగ్ మెషిన్, టాబ్లెట్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ పై గొప్ప డీల్స్ అందుకోవచ్చని మనం ఆశించవచ్చు. ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ ను ఈసారి Axis మరియు ICICI Bank భాగస్వామ్యంతో తీసుకొచ్చింది. అందుకే, ఈ సేల్ నుంచి ఈ రెండు బ్యాంక్ కార్డ్స్ తో వస్తువులు కొనుగోలు చేసే వారికి 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
Also Read: Apple Watch Series 12: యాపిల్ కొత్త వాచ్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ పూర్తిగా తెలుసుకోండి.!
ఐఫోన్ పాత సిరీస్ పై ఆఫర్లు వచ్చే అవకాశం ఉందా? అనే ప్రశ్న ఇపుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ గా మారింది. ఎందుకంటే, కొత్త లాంచ్ తో పాత ఫోన్ రేట్లు తగ్గించే యాపిల్, ఇప్పుడు ఇందుకు విరుద్ధంగా పాత ఫోన్ రేట్లు పెంచేసింది. పండుగ సీజన్ సేల్ కోసం ఎదురు చూసే వారికి ఇది ఈ కొత్త సమస్య సృష్టించింది. మరి ఈ అప్ కమింగ్ సేల్ నుంచి ఐఫోన్ పై ఫ్లిప్ కార్ట్ ఎటువంటి డీల్స్ అండ్ ఆఫర్స్ అందిస్తుందో చూడాలి.