కేవలం 12 వేల ధరలోనే 11 ఇంచ్ బిగ్ స్క్రీన్ 4G Tablet పొందండి.. ఎక్కడంటే.!

HIGHLIGHTS

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ రేట్లు పెరిగిన తరుణంలో అందరి దృష్టి కూడా పెద్ద స్క్రీన్ తో వచ్చే టాబ్లెట్స్ పైన పడింది

మాండ్ తో పాటు సేల్స్ తో పెరగడంతో మార్కెట్లో టాబ్లెట్ లు నిండుకున్నాయి

బడ్జెట్ యూజర్ల కోసం కేవలం 12 వేల ధరలోనే 11 ఇంచ్ బిగ్ స్క్రీన్ 4G Tablet డీల్

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ రేట్లు పెరిగిన తరుణంలో అందరి దృష్టి కూడా పెద్ద స్క్రీన్ తో వచ్చే టాబ్లెట్స్ పైన పడింది. అయితే, డిమాండ్ తో పాటు సేల్స్ తో పెరగడంతో మార్కెట్లో టాబ్లెట్ లు నిండుకున్నాయి. అంతేకాదు, ఈ టాబ్లెట్ 4G కనెక్టివిటీ మరియు Wi-Fi సపోర్ట్ తో కూడా వస్తుంది. బడ్జెట్ ధరలో మంచి ఫీచర్స్ కలిగిన బడ్జెట్ 4జి ట్యాబ్ కోసం చూసే యూజర్లకు ఈ ట్యాబ్ సరిపోతుంది. అందుకే, బడ్జెట్ యూజర్ల కోసం కేవలం 12 వేల ధరలోనే 11 ఇంచ్ బిగ్ స్క్రీన్ 4G Tablet డీల్ ని ఈరోజు ప్రత్యేకంగా అందిస్తున్నాము.

4G Tablet : ఆఫర్

బడ్జెట్ ధరలో లభిస్తున్న ఈ ట్యాబ్లెట్ డీల్ విషయానికి వస్తే, Ai+ రీసెంట్ గా విడుదల చేసిన Plus Tab ఈరోజు ఈ బడ్జెట్ ప్రైస్ లో లభిస్తుంది. ఈ ట్యాబ్ ఈరోజు 30% బిగ్ డిస్కౌంట్ తో కేవలం రూ. 13,999 రూపాయల ఆఫర్ ధరలో ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ ట్యాబ్ పైన రూ. 500 అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ మరియు HDFC క్రెడిట్ కార్డు రూ. 1,250 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.

ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ నుంచి ఈరోజు అందించిన ఈ డీల్స్ తో ఈ కొత్త టాబ్లెట్ ని కేవలం రూ. 12,249 రూపాయల అతి చవక ధరలో పొందొచ్చు. ఈ ప్రైస్ లో ఇది మంచి ఫీచర్స్ కలిగిన బడ్జెట్ టాబ్లెట్ డీల్ గా ఉంటుంది.

Also Read: AI వీడియోలతో పూర్తి AI YouTube ఛానెల్‌ ఎలా క్రియేట్ చేయాలి.. స్టెప్ బై స్టెప్ గైడ్.!

Ai+ 4G Tablet : ఫీచర్స్

ఇది ఇండియన్ బ్రాండ్ విడుదల చేసిన కొత్త టాబ్లెట్. ఇది 10.95 ఇంచ్ LCD బిగ్ స్క్రీన్ ను FHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్ మీడియాటెక్ Helio G88 4జి ప్రాసెసర్ తో పని చేస్తుంది. అలాగే, ఈ ఫోన్ 6 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్ Wi-Fi + 4G కనెక్టివిటీ తో వస్తుంది మరియు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం పై నడుస్తుంది.

ఇందులో వెనుక 13MP మెయిన్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ట్యాబ్ లో క్వాడ్ స్పీకర్ సిస్టం ఉంది కాబట్టి మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ట్యాబ్ లో 8000 mAh భారీ బ్యాటరీ మరియు ఈ ట్యాబ్ ను వేగంగా ఛార్జ్ చేసే ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :