AI వీడియోలతో పూర్తి AI YouTube ఛానెల్‌ ఎలా క్రియేట్ చేయాలి.. స్టెప్ బై స్టెప్ గైడ్.!

HIGHLIGHTS

ఏఐ టూల్స్ సహాయంతో AI YouTube ఛానెల్‌ ను స్టార్ట్ చేయవచ్చు

కెమెరా, స్టూడియో, ఖరీదైన ఎడిటింగ్ పరికరాలు లేకుండానే యూట్యూబ్ ఛానల్ పెట్టొచ్చు

AI స్టోరీ టెల్లింగ్ ఛానల్ మరియు ఏఐ తో ఏఐ గురించి వివరించే ఛానల్స్ మీరు పరిగణలోకి తీసుకోవచ్చు

ప్రస్తుతం కెమెరా, స్టూడియో, ఖరీదైన ఎడిటింగ్ పరికరాలు లేకుండానే ఏఐ టూల్స్ సహాయంతో AI YouTube ఛానెల్‌ ను స్టార్ట్ చేయవచ్చు. వీడియో స్క్రిప్ట్ రాయడం మొదలుకొని ఏఐ వాయిస్ ఓవర్, వీడియో క్లిప్స్, ఎడిటింగ్, థంబ్‌ నెయిల్ తయారీ వరకు అన్ని పనులు కూడా ఏఐ ద్వారా చాలా సులభంగా చేయవచ్చు. ముఖ్యంగా, తెలుగు ఫన్ వీడియోలు, స్మార్ట్‌ ఫోన్ రివ్యూలు, ఏఐ టూల్స్, హౌ టు గైడ్ మరియు ఎడ్యుకేషన్ సంబంధిత వీడియోల కోసం ఇది ఉపయోగకరమైన విధానం. మీరు కూడా ఇదే ఉద్దేశ్యంతో కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చూస్తుంటే, ఒక కొత్త యూట్యూబ్ ఛానెల్‌ ను ప్రారంభించడం నుంచి ఏఐ వీడియో తయారీ, అప్‌ లోడ్, SEO మరియు మానిటైజేషన్ వరకు పూర్తి ప్రక్రియ వివరంగా అందించాము.

ఎలాంటి AI YouTube ఛానెల్ ప్రారంభించాలి?

ఇది పూర్తిగా మీ అభిరుచి మరియు ఈ విషయం పైన మీకు ఎక్కువ ప్రావీణ్యం ఉంది, అనేది నిర్ణయిస్తుంది. ఎందుకంటే, ఈ ఇంట్రెస్ట్ ఎంత బలంగా ఉంటుందో, మీ యూట్యూబ్ ఛానల్ అంత త్వరగా పిక్ అప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో మీ అభిరుచిని బట్టి, టెక్ న్యూస్ ఛానెల్, ఎడ్యుకేషన్, ఆసక్తికర విషయాలు తెలియ చేసే ఛానెల్, AI స్టోరీ టెల్లింగ్ ఛానల్ మరియు ఏఐ తో ఏఐ గురించి వివరించే ఛానల్స్ మీరు పరిగణలోకి తీసుకోవచ్చు.

మొదట మీరు ఒక ప్రధాన అంశాన్ని ఎంచుకుని, అదే తరహా ప్రేక్షకులకు ఉపయోగపడే వీడియోలు రూపొందించడం మంచిది.

AI YouTube ఛానెల్‌ను ఎలా క్రియేట్ చేయాలి?

యూట్యూబ్ ఛానెల్‌ ను ప్రారంభించడానికి Google Account అవసరం. మీ ఛానల్ క్రియేట్ చేయడానికి కంప్యూటర్ లేదా మొబైల్ ద్వారా ఈ క్రింద అందించిన స్టెప్స్ ఫాలో అవ్వండి.

  • మీ గూగుల్ అకౌంట్ తో యూట్యూబ్ లో సైన్ ఇన్ అవ్వండి.
  • మీ ప్రొఫైల్ ఫోటో పై క్లిక్ చేసి, Settings ద్వారా మీ ఛానెల్ సృష్టించే ఆప్షన్‌ ఎంచుకోండి.
  • మీ ఛానెల్‌ కు ప్రత్యేకమైన పేరును ఎంచుకోండి.
  • అందుబాటులో ఉన్న హ్యాండిల్‌ ను ఎంచుకోండి.
  • మీ ఛానెల్‌కు ప్రొఫైల్ ఫోటో, బ్యానర్, About వివరణను జోడించండి.
  • YouTube Studio లో ఛానెల్ సెట్టింగ్స్, ఆడియన్స్, అప్‌ లోడ్ డిఫాల్ట్స్‌ ను పరిశీలించండి.

మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, సులభంగా గుర్తు పట్టేలా మీ ఛానెల్ పేరు ఉండేలా చూసుకోండి. ఇతర ఛానెల్ పేర్లు అనుకరించకుండా, భవిష్యత్తులోనూ ఉపయోగించగలిగే బ్రాండ్ పేరును ఎంచుకోండం మంచిది.

AI వీడియోలు తయారు చేయడానికి అవసరమైన టూల్స్

ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన పని మీ ఛానల్ లో అప్లోడ్ చేయడానికి వీడియోలు తయారు చేయడానికి అవసరమైన టూల్స్. దీనికోసం, Chat GPT ని స్క్రిప్ట్ రైటింగ్ కోసం ఉపయోగించవచ్చు. తర్వాత వీడియో థంబ్‌ నెయిల్స్ మరియు గ్రాఫిక్స్ కోసం Canva, వీడియో ఎడిటింగ్ కోసం CapCut మరియు AI వీడియో జనరేషన్ కోసం Runway ప్లాట్ ఫామ్ ను ఉపయోగించవచ్చు. ఈ వీడియో AI వాయిస్ ఓవర్ కోసం Eleven Labs ప్లాట్ ఫామ్ ని ఉపయోగించవచ్చు.

ఇక్కడ మీరు గమనించాల్సిన విషయాలు ఏమిటంటే, ఇక్కడ సూచించినవి సాధారణంగా ఉపయోగించగల టూల్స్‌ కు ఉదాహరణలు మాత్రమే. వీటిలో అన్ని ఫీచర్లు ఉచితంగా లభిస్తాయని భావించకండి. వీడియోలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించే ముందు సంబంధిత టూల్ లైసెన్స్, అప్‌లోడ్ పరిమితులు, కమర్షియల్ యూజ్ నిబంధనలు కచ్చితంగా చెక్ చేయండి.

Also Read: Samsung Galaxy S25 Ultra 5G పై మరోసారి జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్.!

AI వీడియోలతో యూట్యూబ్ మానిటైజేషన్ పొందవచ్చా?

అవును, AI టూల్స్ ఉపయోగించి తయారు చేసిన వీడియోలు కూడా యూట్యూబ్ మానిటైజేషన్‌ కు అర్హత పొందవచ్చు. అయితే, కేవలం AI ఉపయోగిస్తే చాలు ఎటువంటి శ్రమ లేకుండా ఆదాయం వస్తుందని భావించకూడదు.

యూట్యూబ్ అధికారిక మానిటైజేషన్ విధానం ప్రకారం, కంటెంట్ ఒరిజినల్‌ గా మరియు ప్రేక్షకులకు ఉపయోగకరంగా ఉండాలి. ఒకే టెంప్లేట్‌ తో పెద్ద సంఖ్యలో దాదాపు ఒకేలా ఉండే వీడియోలను తయారు చేయడం, ఇతరుల కంటెంట్‌ ను స్వల్ప మార్పులతో మళ్లీ అప్‌ లోడ్ చేయడం, ప్రత్యేక విలువ లేని ఆటోమేటెడ్ వీడియోలు తయారు చేయడం వల్ల మానిటైజేషన్ తిరస్కరించ బడవచ్చు. ఈ విధానం AI వీడియోలకే కాకుండా అన్ని రకాల కంటెంట్‌ కూ వర్తిస్తుంది.

కాబట్టి, మీ ఊహల్లో ఉన్న సొంత కంటెంట్ కి ఏఐ తో ప్రాణం పోసి మీ కంటెంట్ గా మీ యూట్యూబ్ ఛానల్ లో చూపించడం మంచి నిర్ణయం అవుతుంది. ఇది మీలో ఉన్న నిజమైన కళకు ప్రాణం పోస్తుంది.

ఏఐ సహాయంతో యూట్యూబ్ ఛానెల్‌ ను ప్రారంభించడం గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా సులభమైంది. కానీ, ఛానెల్ విజయాన్ని నిర్ణయించేది ఏఐ టూల్స్ సంఖ్య కాదని గమనించాలి. మీ అంశంపై మీ అవగాహన, సొంత కథనం, వాస్తవమైన సమాచారం, మంచి వాయిస్ ఓవర్, ఆసక్తికరమైన ఎడిటింగ్, ప్రేక్షకులతో నిరంతర సంబంధం ముఖ్యమైనవి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :