flipkart announces big deals on Samsung Galaxy S25 Ultra 5G
Samsung Galaxy S25 Ultra 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో చాలా రీజనబుల్ ప్రైస్ లో లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ రీసెంట్ గా నిర్వహించిన బిగ్ బిలియన్ డేస్ సేల్ తర్వాత కొత్త సేల్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ పై మరోసారి జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ అనౌన్స్ ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ పై కొత్త ఫ్లిప్ కార్ట్ అందించిన బిగ్ డీల్స్ అండ్ ఆఫర్స్ ఏమిటో చూద్దామా.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 1,29,999 రూపాయల ఆఫర్ ధరలో లాంచ్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ ఈరోజు 33% భారీ డిస్కౌంట్ తో రూ. 86,688 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఇది కాకుండా స్మార్ట్ ఫోన్ పైన రూ. 6,625 రూపాయల భారీ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ Axis మరియు ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డు తో తీసుకునే వారికి ఈ డిస్కౌంట్ అందిస్తుంది.
ఫ్లిప్ కార్ట్ కొత్త సేల్ నుంచి అందించిన ఈ బిగ్ డీల్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు మీకు కేవలం రూ. 80,063 రూపాయల బడ్జెట్ ధరలో మీకు లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఇది బెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ డీల్ గా ఉంటుంది.
Also Read: కేవలం 4 వేల రూపాయల బడ్జెట్ లోనే 5.1 Soundbar కావాలా .. ఒక లుక్కేయండి.!
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా 6.9 ఇంచ్ డైనమిక్ AMOLED 2X డిస్ప్లేని QHD+ రిజల్యూషన్, HDR10+ సపోర్ట్, 1–120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ 2 గ్లాస్ ప్రొటెక్షన్ వంటి చాలా ప్రీమియం ఫీచర్స్ తో వస్తుంది. ఇది చాలా గొప్ప డిజైన్ కలిగి ఉంటుంది మరియు ఈ ఫోన్ Snapdragon 8 Elite చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 12 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ తో సూపర్ పెర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ బిల్ట్ ఇన్ S పెన్ సపోర్ట్ తో కూడా వస్తుంది.
ఈ ఫోన్ లో 200MP ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా మరియు 10MP టెలిఫోటో కెమెరాలు కలిగిన క్వాడ్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. అలాగే, ఫోన్ లో 12MP సెల్ఫీ కెమెరా కూడా ఫోన్ ముందు భాగంలో ఉంది. ఈ ప్రీమియం ఫోన్ 8K రిజల్యూషన్ వీడియో రికార్డింగ్ మరియు 120fps 4k వీడియో రికార్డింగ్ అందిస్తుంది. ఈ ఫోన్ లో 5000 mAh బ్యాటరీ ఉంది మరియు ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉంది.