Apple Watch Series 12: యాపిల్ కొత్త వాచ్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ పూర్తిగా తెలుసుకోండి.!

HIGHLIGHTS

యాపిల్ కొత్తగా వాచ్ సిరీస్ 12 స్మార్ట్ వాచీలు విడుదల చేసింది

కొత్త ఆడియో ఇంటెలీజెన్స్ మరియు కొత్త Siri వాయిస్ వంటి ఫీచర్స్ లాంచ్

S11 చిప్ తో అందించింది మరియు ఇది 64GB బిగ్ ఇంటర్నల్ స్టోరేజ్ తో రిలీజ్

Apple Watch Series 12: యాపిల్ కొత్త వాచ్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ పూర్తిగా తెలుసుకోండి.!

Apple Watch Series 12: యాపిల్ కొత్తగా వాచ్ సిరీస్ 12 స్మార్ట్ వాచీలు విడుదల చేసింది. ఈ కొత్త వాచ్ లలో ఈసారి ఇప్పటి వరకు చూడని కొత్త ఆడియో ఇంటెలీజెన్స్ మరియు కొత్త Siri వాయిస్ వంటి ఫీచర్స్ తో వచ్చింది. ఈ సిరీస్ నుంచి లాంచ్ చేసిన అన్ని వాచ్ ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Apple Watch Series 12: ప్రైస్

  • యాపిల్ వాచ్ సిరీస్ 12 42mm (అల్యూమినియం) ధర : రూ. 56,900
  • యాపిల్ వాచ్ సిరీస్ 12 46mm (అల్యూమినియం) ధర : రూ. 62,900
  • యాపిల్ వాచ్ సిరీస్ 12 42mm (టైటానియం) ధర : రూ. 99,900
  • యాపిల్ వాచ్ సిరీస్ 12 46mm (టైటానియం) ధర : రూ. 1,04,900
  • యాపిల్ వాచ్ సిరీస్ 12 42mm (సిరామిక్) ధర : రూ.1,24,900
  • యాపిల్ వాచ్ సిరీస్ 12 46mm (సిరామిక్) ధర : రూ.1,30,900

వీటిలో అల్యూమినియం మోడల్ ని డార్క్ బ్రోన్జ్, లైట్ గోల్డ్, బ్లాక్ మరియు గ్రే నాలుగు రంగుల్లో అందించింది. అయితే, టైటానియం మోడల్ ను రేడియంట్ గోల్డ్ మరియు నేచురల్ అనే రెండు రంగుల్లో మరియు సిరామిక్ మోడల్ ని పర్ల్ వైట్ మరియు నైట్ బ్లూ మూడు రంగుల్లో లాంచ్ చేసింది. ఈ యాపిల్ లేటెస్ట్ వాచ్ సిరీస్ సెప్టెంబర్ 18వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Also Read: Apple Budget iPhone కోసం చూస్తున్న వారికి బ్యాడ్ న్యూస్ .. పాత ఫోన్ రేటు పెరిగింది.!

Apple Watch Series 12: ఫీచర్స్

యాపిల్ వాచ్ సిరీస్ 12 లో నిరంతరం వెలిగే రెటినా వైడ్ యాంగిల్ OLED డిస్ప్లే ఉంది. ఈ వాచ్ 42mm మోడల్‌లో 374 × 446 పిక్సెల్స్ మరియు 46mm మోడల్‌ లో 416 × 496 పిక్సెల్స్ రిజల్యూషన్ ఉంటుంది. ఈ వాచ్ డిస్ప్లే గరిష్ఠంగా 2,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ఉంటుంది. ఇది అల్యుమినియం, టైటానియం మరియు సిరామిక్ మూడు మోడల్స్ లో లభిస్తుంది. ఈ కొత్త వాచ్ సిరీస్ ను S11 చిప్ తో అందించింది మరియు ఇది 64GB బిగ్ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

ఈ వాచ్ లో ఉన్న ఈ హిప్ ఏ వాచ్ ను మరింత శక్తివంతంగా మార్చింది. ఈ వాచ్ లో ఉన్న హెల్త్ ట్రాకింగ్ ను మరింత అప్గ్రేడ్ చేసింది. ఇందులో అత్యంత ముఖ్యమైంది ‘సరికొత్త హెల్త్ సెన్సింగ్ సిస్టం’. ఈ కొత్త సెన్సార్ సిస్టమ్ ద్వారా ఈ వాచ్ యూజర్ హార్ట్ రేట్‌ ను మరింత తరచుగా మానిటర్ చేయగలదు. ఇందులో ECG, Blood Oxygen, Heart Rate, Sleep, Sleep Score, Vitals, Cycle Tracking, Medications వంటి చాలా ప్రీమియం హెల్త్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఈ కొత్త వాచ్ సిరీస్ లో Siri AI కి కూడా కొత్త అప్‌ గ్రేడ్ లభించింది. ఇందులో అందించిన S11 చిప్ ఆధారంగా Audio Intelligence ఫీచర్లను కూడా ఇందులో జత చేసింది. ఇది 24 గంటల బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile