ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి Galaxy S23 FE పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది.!
ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి ఈరోజు అతి భారీ డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది
శాంసంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది
Galaxy S23 FE స్మార్ట్ ఫోన్ పై ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది
ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి ఈరోజు అతి భారీ డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. శాంసంగ్ భారత మార్కెట్లో రీసెంట్ గా విడుదల చేసిన ప్రీమియం స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. శాంసంగ్ యొక్క Galaxy S23 FE స్మార్ట్ ఫోన్ పై ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ ఆఫర్ దెబ్బకు ఈ స్మార్ట్ ఫోన్ చాలా తక్కువ ధరకే లభిస్తోంది.
SurveySamsung Galaxy S23 FE : ఆఫర్
శాంసంగ్ గెలాక్సీ S23 FE స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 54,999 రూపాయల లాంచ్ ప్రైస్ తో విడుదల చేయబడింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి రూ. 24,000 రూపాయల అతి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 30,999 ధరకే లభిస్తోంది.

అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి 5% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ ను 30 వేల రూపాయల కంటే తక్కువ ధరకే ఈ ఫోన్ ను అందుకోవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ పై 6 నెలల No Cost EMI ఆఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది.
Samsung Galaxy S23 FE : ఫీచర్స్
శాంసంగ్ గెలాక్సీ S23 FE స్మార్ట్ ఫోన్ సూపర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP + 12MP + 8MP ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 10MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ తో 24 fps వద్ద UHD 8K (7680 x 4320) వీడియోలు షూట్ చేయవచ్చు మరియు గొప్ప స్టన్నింగ్ ఫోటోగ్రఫీ కూడా పొందవచ్చు. ఈ ఫోన్ శాంసంగ్ సొంత చిప్ సెట్ Exynos 2200 తో పని చేస్తుంది మరియు దీనికి జతగా 8GB ర్యామ్ తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.
Also Read : Redmi Note 14 Pro+ : AI సపోర్ట్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో లాంచ్ కన్ఫర్మ్.!
ఈ శాంసంగ్ ఫోన్ 6.4 ఇంచ్ Dynamic AMOLED 2X పవర్ ఫుల్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120 Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్, HDR 10+ సపోర్ట్ మరియు సన్ లైట్ లో కూడా కనిపించేలా అధిక బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ అల్యూమినియం ఫ్రెమ్ పటిష్టంగా ఉంటుంది మరియు స్క్రీన్ పై కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ కూడా ఉంటుంది. ఈ ఫోన్ 4500 mAh బ్యాటరీని ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile