డిజిట్ జీరో 1 అవార్డ్స్ 2020: బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్

డిజిట్ జీరో 1 అవార్డ్స్ 2020: బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్

ఈ సంవత్సరం అంతటా ప్రతికూల వాతావరణం ఏర్పడినట్లుగానే, బడ్జెట్ స్మార్ట్ ఫోన్ విభాగంలో కూడా మార్కెట్లో వున్న ప్రతికూల పరిస్థితులు మరియు ఇతర కారణాల వలన హార్డ్ వేర్ ధరలు పెరగడంతో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల కోసం ఎప్పుడూ కొండగుర్తుగా తీసుకునే 10 వేల రూపాయల పరిధిని 15 000 మరింతగా పెంచవలసి వచ్చింది. ఫలితంగా, మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1, పోకో M2 ప్రో వంటి మరిన్ని ఎంట్రీలు  వచ్చిచేరాయి.  ఇది ప్రస్తుతం మెడియాటెక్ ఆధిపత్యం కలిగిన విభాగం. ఇది ఎంట్రీలెవల్ స్మార్ట్ ఫోనులో కూడా మంచి గేమింగ్ పనితీరును అందిస్తుంది. ఈ తైవాన్ కంపెనీ ధర మరియు పెర్ఫార్మెన్స్ పరంగా క్వాల్కామ్ ను బీట్ చేయగలిగింది.

Winner: Realme Narzo 20 Pro

narzo 20 pro intext.jpg

Narzo 20 స్మార్ట్ ఫోన్ Realme నుండి వచ్చిన కొత్త సబ్ బ్రాండ్ ఫోన్. నమ్మకమైన క్వాడ్ కెమెరా, 65 W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు ఎడ్జ్ టూ ఎడ్జ్ డిస్ప్లే వంటి కొన్ని మంచి విషయాలతో వస్తుంది. నార్టో 20 ప్రో లో అందించిన మీడియాటెక్ హెలియో జి 95 కి ప్రాసెసర్ కి కృతజ్ఞతలు.  ఇది CPU , GPU మరియు బ్యాటరీ స్కోర్‌లలో మా బడ్జెట్ స్మార్ట్‌ ఫోన్ టెస్ట్ షీట్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఇది అధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 64MP వంటి వాటిని కలిగి ఉండకపోయినా, బేసిక్ లను బాగా కవర్ చెయ్యడం ద్వారా మంచి పనితీరును అందిస్తుంది. మూవీస్ చూడడం, సోషల్ మీడియాను బ్రౌజ్ చేయడం మరియు CoD వంటి గేమింగ్ కూడా గుర్తించదగిన ఫ్రేమ్ డాట్స్ లేకుండా నడిపిస్తుంది. పెద్ద బ్యాటరీలను సాధారణ ఛార్జర్ తో ఛార్జ్ చేసే స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా వుండే ఈ విభాగంలో 65W ఫాస్ట్ ఛార్జింగ్  తో కేవలం 30 నిముషాల్లోనే 4,500mAh బ్యాటరీ నింపే సామర్ధ్యం మొత్తం ఆటనే మార్చేస్తుంది. అందుకే, 15,000 రూపాయల బడ్జెట్ ధరలో Realme Narzo 20 Pro స్మార్ట్ ఫోన్ డిజిట్ జీరో వన్ అవార్డు యొక్క విజేతగా నిలిచింది.

Runner Up: Redmi 9 Prime

redmi 9 prime intext.jpg

రెడ్‌మి 9 ప్రైమ్ ఇదే బడ్జెట్ విభాగంలో రెండవ స్థానంలో నిలిచింది మరియు ఈ సంవత్సరం 15,000 రూపాయల లోపు మీరు కొనుగోలు చేయగల అత్యంత బేలెన్స్డ్  ఆల్ రౌండర్ స్మార్ట్ ఫోన్. అయితే, దీనికి అత్యంత శక్తివంగతమైన స్పెసిఫికేషన్స్ లేవు. కానీ తక్కువ ధరకే ఎక్కువ పనిని అందించగల ఫోన్ గా నిలిచింది. రెడ్‌మి 9 ప్రైమ్ విలక్షణమైన 6.5-అంగుళాల ఎల్‌సిడి డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది వీడియోలను చూడడానికి అనువైనది. ఇందులో అందించిన 12MP క్వాడ్ కెమెరా సంఖ్య పరంగా అంత గొప్పగా అనిపించదు. కానీ, ఇది అందించే ఫోటోలు మాత్రం ఖరీదైన స్మార్ట్ ఫోన్ అందించే వాటికీ ఎంత మాత్రము తీసిపోవు. రోజు వారీ పనులు షోషల్ బ్రౌజింగ్ లేదా సినిమాలు చూడడం వంటి పనులతో పాటుగా CoD గేమ్ ను కూడా మీడియం గ్రాఫిక్స్ లో చక్కగా ఆనందించవచ్చు. ఇక ఇందులో అందించిన 5000mAh  బ్యాటరీ ఒక రోజు మొత్తం పనిచేస్తుంది.            

Best Buy: Redmi Note 9

redmi note 9 intext.jpg

రెడ్‌మి నోట్ 9 షియోమి నుండి వచ్చిన ప్రతిష్టాత్మక నోట్ లైనప్‌కు చెందినది. అయితే, ఈ సంవత్సరం స్మార్ట్‌ఫోన్ తయారీ ఖర్చులు పెరగడంతో, రెడ్‌మి నోట్ 9 ధరను స్వల్పంగా పెంచడం కోసం చాలా అందిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో అందించిన మెడియాటెక్ హీలియో G85 CoD గేమ్ ను కూడా ఎటువంటి ఫ్రేమ్ లాస్ లేకుండా నడిపిస్తుంది. కానీ, మల్టిపుల్ క్రోమ్ టాబ్స్ మరియు ఎక్కువ యాప్స్ ను ఒకేసారి ఓపెన్ చేస్తే మాత్రం కొంత నెమ్మదిస్తుంది. 5000mAh పెద్ద బ్యాటరీతో ఒక రోజంతా నిరంతరంగా పనిచేస్తుంది. అందుకే, రోజువారీ వాడకంలో మంచి పనితీరుతో మరియు లాంగ్ లైఫ్ బ్యాటరీతో డిజిట్ జీరో 1 యొక్క బెస్ట్ బై అవార్డును దక్కించుకుంది.            

డిజిట్ జీరో వన్ అవార్డ్స్ గురించి 

20 సంవత్సరాలు అలుపెరుగని నిరంతర కృషితో, డిజిట్ జీరో 1 అవార్డులు ఇండస్ట్రీ యొక్క ఏకైక పెర్ఫార్మెన్స్-ఆధారిత అవార్డులుగా గుర్తించబడ్డాయి. మా అభిమానులు మరియు ఆడియన్స్ కోసం డిజిట్ సంవత్సరాల పరిశోధనలో మంచి పనితీరుతో నడిచే ప్రొడక్టులను అభివృద్ధి చేయడంలో మరియు పరిచయం చేయడంలో కృషి చేసిన బ్రాండ్లకు బహుమతులు ఇస్తుంది.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo