ఈ మద్యనే లాంచ్ అయిన అతి చవకైన స్మార్ట్ ఫోన్ లలో మోటో సి ప్లస్ అండ్ రెడ్మీ 4 చెప్పుకోదగినవి ఇప్పటికే రెడ్మీ 4 అత్యంత ప్రజాధారణ పొందింది అయితే కొత్తగా వచ్చిన మోటో సి ప్లస్ దీనికి గట్టి పోటీ ని ఇస్తుంది ఇప్పుడు రెండిటి మధ్యగల తేడా ను చూద్దాం
డిస్ప్లే చూసినట్లయితే మోటో సీ ప్లస్ ఫోన్ 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్ప్లేతో వస్తోంది. షియోమీ రెడ్మీ 4 ఫోన్ 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్ప్లేతో వస్తోంది.
మోటో సీ ప్లస్ 1.3గిగాహెట్జ్ MediaTek MT6737 క్వాడ్-కోర్ కార్టెక్స్-ఏ53 సాక్ పై రన్ అవుతుంది. షియోమీ రెడ్మీ 4 మోడల్ 1.4గిగాహెట్జ్ Snapdragon 435 SoC పై రన్ అవుతుంది.
మోటో సీ ప్లస్ ఫోన్ 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. షియోమీ రెడ్మీ 4 మోడల్లో 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను ఏర్పాటు చేసారు.
మోటో సీ ప్లస్ ఫోన్ ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. షియోమీ రెడ్మీ 4 ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది
మోటో సీ ప్లస్ : 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, షియోమీ రెడ్మీ 4: 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,