The Impact of 5G in Villages How Has Youth Life Changed After the Arrival of the Internet
5G Internet అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ మరియు అందులో వేగవంతమైన ఇంటర్నెట్ ఉంటే చాలు, గ్రామంలోని యువతకు సైతం ప్రపంచం అరచేతిలోకి ఇచ్చినట్లయింది. ముఖ్యంగా, 5G నెట్ వర్క్ విస్తరణతో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగం మరింత వేగంగా మరియు సులభంగా చేరింది. 5G అంటే కేవలం వేగంగా వీడియోలు చూడటం లేదా సినిమాలు డౌన్ లోడ్ చేసుకోవడం మాత్రమే కాదు. విద్య, ఉద్యోగాలు, వ్యవసాయం, వ్యాపారం, డిజిటల్ చెల్లింపులు, ఆరోగ్యం, వినోదం, కంటెంట్ క్రియేషన్ వంటి అనేక రంగాల్లో గ్రామీణ యువత ఆలోచనా విధానాన్ని కూడా ఇది మారుస్తోంది.
5జి అనడం కన్నా నిజానికి 4G వచ్చినప్పుడే గ్రామాల్లో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. సోషల్ మీడియా, YouTube, ఆన్ లైన్ క్లాసులు, డిజిటల్ చెల్లింపులు వంటి సేవలు ప్రజలకు చాలా చేరువయ్యాయి. ఇప్పుడు 5G మరింత వేగవంతమైన కనెక్టివిటీని అందించడంతో డేటా ఆధారిత సేవలను ఉపయోగించడం మరింత సులభమయ్యింది.
ఒకప్పుడు ఇంటర్నెట్ కోసం దగ్గరలో ఉన్న సిటీ కోసం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది. అయితే. ఇప్పటి గ్రామీణ యువకుడు లేదా యువతి గ్రామం నుండి బయటకు వెళ్లకుండానే వారి ఇంట్లో కూర్చొనే ఆన్ లైన్ కోర్సు సైతం చేయగలరు. అంతేకాదు మారిన కాలంతో వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ తో ఉద్యోగాలకు సైతం చేయగలుగుతున్నారు. ఇదే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్ ను పరిశీలించగలడు మరియు గ్రామాల్లో తయారు చేసే ఉత్పత్తులను సైతం సోషల్ మీడియా ద్వారా విక్రయించ గలుగుతున్నారు. ఇది 5జి ఇంటర్నెట్ తో గ్రామాల్లో వచ్చిన పెద్ద మార్పు గ చూడవచ్చు.
గ్రామీణ యువత జీవితంలో 5G ఇంటర్నెట్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్న ప్రదానమైన రంగాల్లో విద్య ఒకటి. గతంలో మంచి ఫ్యాకల్టీ లేదా ప్రత్యేకమైన కోచింగ్ కోసం సిటీ దారి పట్టాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలు, కోచింగ్ ప్లాట్ ఫారాలు, YouTube విద్యా ఛానళ్ల ద్వారా పాఠాలు ఇంటి గ్రామంలో ఉన్న వారి సొంత ఇంటి నుంచే చూడవచ్చు మరియు నేర్చుకోవచ్చు.
ముఖ్యంగా, వేగవంతమైన ఇంటర్నెట్ కారణంగా HD వీడియో క్లాసులు, లైవ్ ఇంటరాక్టివ్ సెషన్లు, పెద్ద ఫైళ్లను సైతం డౌన్ లోడ్ చేయడం వంటి పనులు గతంతో పోలిస్తే 5జి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత చాలా సులభంగా మారింది.
గతంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ లేదా ప్రైవేటు ఉద్యోగాల సమాచారం కోసం పత్రికలు లేదా మధ్యవర్తుల పై ఆధార పడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు మొబైల్ లోనే ఉద్యోగ నోటిఫికేషన్లు, కంపెనీల వెబ్ సైట్లు, LinkedIn వంటి ప్లాట్ ఫారాలలో ఉన్న ఉద్యోగ పోర్టల్ ద్వారా అవకాశాలను తెలుసుకోవచ్చు.
కేవలం తెలుసుకోవడం మాత్రం కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా నేషనల్ మరియు ఇంటర్నేషనల్ కంపెనీలు ఆఫర్ చేస్తున్న వర్క్ ఫ్రొం హోమ్ ఆప్షన్ తో సొంత గ్రామం నుంచే ఉద్యోగాలను నిర్వహించే అవకాశం కూడా 5జి ఇంటర్నెట్ అందించింది. ఎందుకంటే, 5జి ఇంటర్నెట్ అనేది అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యంగా ఉంటుంది మరియు ఇది అంతరాయం లేని సేవలు అందిస్తుంది. ఫ్రీలాన్సింగ్, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, కంటెంట్ రైటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఆన్ లైన్ ట్యూటరింగ్ వంటి నైపుణ్యాలు ఉన్న యువత ఇంటి నుంచే పని చేయడానికి ఈ సౌకర్యం ద్వారా ప్రయత్నిస్తున్నారు.
సింపుల్ గా చెప్పాలంటే, ఒకప్పుడు ఉద్యోగం కోసం యువత గ్రామం విడిచి పెద్ద పట్టణానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు కొన్ని ఉద్యోగాల విషయంలో పని ఉన్న చోటే ఉండాల్సిన అవసరం లేకుండా పోతోంది.
5G ప్రభావం వినోద రంగంలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామాల్లోని యువత ఇప్పుడు కేవలం ఇతరుల వీడియోలు చూడటం మాత్రమే కాదు, వారు వారి వినూత్నమైన ఐడియాలు మరియు కంటెంట్ తో కంటెంట్ క్రియేటర్ గా కూడా మారుతున్నారు. గ్రామీణ జీవనశైలి, స్థానిక వంటకాలు, వ్యవసాయ పద్ధతులు, జానపద కళలు, పర్యాటక ప్రాంతాలు, స్థానిక సమస్యలు, కామెడీ, షార్ట్ వీడియోలు వంటి అంశాలపై కంటెంట్ రూపొందిస్తున్నారు. ఈ కంటెంట్ కి ఇప్పుడు ఆదరణ కూడా చాలా గొప్పగా పెరిగింది. ఇది గ్రామీణ ప్రతిభకు కొత్త వేదిక అందిస్తోంది.
Also Read: పండుగ సేల్ కంటే ముందే Samsung 55 Mini LED స్మార్ట్ టీవీ పై నెవర్ బిఫోర్ డిస్కౌంట్.!
గ్రామీణ యువత లో చాలామంది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయం తో సంబంధం కలిగి ఉంటారు. అందువల్ల ఇంటర్నెట్ గ్రామాల్లోని వ్యవసాయ రంగంలో కూడా మార్పులు తీసుకొస్తోంది. విష ముఖ్యమైన ఉపయోగాలు ఇక్కడ చూడవచ్చు.
ఇలాంటి మరిన్ని సలహాలు మరియు సూచనలు కూడా 5జి ఇంటర్నెట్ తో గ్రామాల జీవిత విధానాన్ని పూర్తిగా మార్చేసింది. అంతేకాదు, భవిష్యత్తులో 5G ఆధారిత IoT పరికరాలు, సెన్సర్లు, డ్రోన్లు, స్మార్ట్ ఇరిగేషన్ వంటి టెక్నాలజీ గ్రామీణ వ్యవసాయంలో మరింత విస్తరించే అవకాశం ఉంది.
ఇంటర్నెట్ వల్ల గ్రామంలోని చిన్న వ్యాపారాలకు కూడా మార్కెట్ పరిధి విస్తరిస్తోంది. ఒక చిన్న గ్రామంలో తయారయ్యే హ్యాండ్ క్రాఫ్ట్ ఉత్పత్తులు, హోమ్ ఫుడ్, చేనేత వస్తువులు, స్థానిక ప్రత్యేక ఉత్పత్తులు వంటి వాటిని సోషల్ మీడియా లేదా ఈ-కామర్స్ ద్వారా ఎక్కువ మంది వినియోగదారులకు పరిచయం చేయవచ్చు. ఇది వ్యాపారాలకు మరింత ఊతమిచ్చే మరియు కొత్త ఊపిరి పోస్తుంది.
అంటే, గ్రామంలోని ఉత్పత్తికి కేవలం గ్రామం మాత్రమే మార్కెట్ కాదు, ఇంటర్నెట్ ద్వారా దేశవ్యాప్తంగా, కొన్ని సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా కస్టమర్లను చేరుకునే అవకాశం ఉంది.
ఒకప్పుడు ఏదైనా చేయాలంటే లేదా కొత్త విషయం నేర్చుకోవాలంటే ఎవరు ఏమనుకుంటారో అని బిడియంగా నడుచుకునే తీరు నుంచి ప్రప్రంచ స్టాండర్డ్ కి తగట్టు గొప్ప నైపుణ్యాలను నేర్చుకునే మరియు నేర్పించే విధంగా గ్రామీణ యువత ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది.
ఈ మార్పు ప్రయాణం గురించి క్లుప్తంగా చెప్పాలంటే, ఒకప్పుడు ‘నగరాల్లో ఉన్న అవకాశాల కోసం గ్రామీణ యువత నగరాల వైపు చూసేది’ కానీ ఇప్పుడు ‘ఇంటర్నెట్ కారణంగా ప్రపంచంలోని అవకాశాలను గ్రామం నుంచి అందిపుచ్చుకునే పరిస్థితి’ వచ్చింది.