40 అంగుళాల ఆండ్రాయిడ్ LED TV ని కేవలం రూ. 18,990 ధరకే అందించిన Daiwa సంస్థ

HIGHLIGHTS

ఇది 1 జీబి ర్యామ్ మరియు 8 GB అంతర్గత స్టోరేజితో వస్తుంది.

40 అంగుళాల ఆండ్రాయిడ్ LED TV ని కేవలం రూ. 18,990 ధరకే అందించిన Daiwa సంస్థ

Daiwa సంస్థ భారతదేశంలో ఒక సరికొత్త TV ని ప్రారంభించింది, దీని యొక్క మోడల్ D42E50S, ఇది ఒక 40-అంగుళాల LED TV. ఇంకా, ఇది ఒక  ఆండ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ సిస్టంతో నడిచే టీవీ మరియు 20W బాక్స్ స్పీకర్లను కలిగి ఉంటుంది. వింటుంటే, ఆశ్యర్యంగా మరియు అందంగా అనిపించవచ్చు.  అవును ఇది నిజం, Daiwa, భారతదేశంలో తాజా టెక్నాలజీగల LED టీవీలను బడ్జెట్ ధరతో తీసుకురావటానికి కట్టుబడి ,దాని తాజా 102cm (40inch) 'D42E50S' LED TV ని ప్రకటించింది. ఇది సొగసైన మరియు వినూత్నమైన డిజైన్నుకలిగి ఉంటుంది, ఇంకా ఈ కొత్త Daiwan TV ఆండ్రాయిడ్ 5.1 వెర్షన్తో వస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ టీవీ టక్నాలజీ మరియు నైపుణ్యం యొక్క అద్భుతమైన కలయికగా ప్రతిబింబిస్తుంది.  అద్భుతమైన ఈ LED TV ఒక అద్భుతమైన 1920 x 1080 స్పష్టత అందిస్తుంది A + గ్రేడ్ ప్యానెల్ మరియు 700000: 1 యొక్క డైనమిక్ కాంట్రాస్ట్ రేషియాతో మంచి స్పష్టత, కలర్ మరియు కంట్రాస్టు  కోసం అనుమతిస్తుంది. ఈ TV లో 1.07 బిలియన్ రంగులను పొందవచ్చు, ఇందులో ప్రతి రంగు గదిలోని ఏటువంటి మూలనుండైనా మీకు పూర్తిగా అందిస్తుంది.

ఈ టీవిలో 20W బాక్స్ స్పీకర్లతో అనుసంధానించబడటం వలన, ఈ టీవీ క్రిస్టల్-క్లియర్ ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది, మీరూ చూసే సినిమా అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఇది సౌండ్ పవర్ మరియు స్పష్టత సర్దుబాటు చేయడానికి 5 వేర్వేరు ఆడియో మోడ్లతో వస్తుంది. స్మార్ట్ TV అనేక కనెక్టివిటీ ఎంపికలను కాలను కలిగి ఉంది, దీనిలో 3 HDMI, 2 USB పోర్టులు, AV ఇన్, TFT కార్డ్ స్లాట్ వంటి బహుళ ఇన్పుట్లను కలిగి ఉంది. ఇది 1 జీబి ర్యామ్ మరియు 8 GB అంతర్గత స్టోరేజితో పాటు, అధికమైన ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ వద్ద పనిచేసే మెరుగైన కార్టెక్స్- A53 క్వాడ్ కోర్ ప్రాసెసర్లో టీవీ పనిచేస్తోంది.

డైనమిక్ అనుభవాన్ని రీడీమ్ చేయడం కోసం , ఈ టీవి ఆప్ స్టోరుతో వస్తుంది, ఇది మీ ఇష్టమైన ఆప్ లను  మరియు M.Cast ఫీచర్ను డౌన్లోడ్ చేయడానికి మికు అనుమతిస్తుంది. ఈ టీవీ కూడా స్మార్ట్ Wi-Fi కు మద్దతు ఇస్తుంది, ఇది ఇంటర్నెట్ కు యాక్సెస్ చేయడం లేదా YouTube వంటి అనువర్తనాలను ఉపయోగించడం సులభం చేస్తుంది. M.Cast  ఫీచర్తో, మీరు సులభంగా మీ Android పరికరాల నుండి సినిమాలు, షోలు మరియు ఫోటోలను ప్రసారం చేయవచ్చు. 

అమెజాన్ మరియు పేటియం  వంటి ఆన్లైన్ మరియు దుకాణాలలో, ప్రముఖ రిటైల్ దుకాణాలలో ఈ టీవీ అందుబాటులో ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo