CMF Phone 2 Pro: నథింగ్ ఉప్ బ్రాండ్ సిఎంఎఫ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం టీజింగ్ మొదలు పెట్టింది. కంపెనీ అందించిన టీజర్ పేజీ ద్వారా ఈ ఫోన్ గ్లిమ్స్ మరియు ఫీచర్స్ హింట్ అందించింది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ మరియు స్టన్నింగ్ స్క్రీన్ తో వస్తుందని కొత్త టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈ సిఎంఎఫ్ అప్ కమింగ్ ఫోన్ విశేషాలు ఏమిటో చూద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
CMF Phone 2 Pro: లాంచ్
సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 28వ తేదీ సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఎప్పటి మాదిరిగా ఈ ఫోన్ కోసం Flipkart ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది.
సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ను వివరించే టీజర్ ఇమేజ్ ను ఈరోజు విడుదల చేసింది. ఈ ఫోన్ లో ఉన్న డిస్ప్లే వివరాలు ఇంకా అందించలేదు. కానీ, ముందుగా వచ్చిన సిఎంఎఫ్ ఫోన్ 1 ను బేస్ చేసుకొని ఈ ఫోన్ స్క్రీన్ ఉవ్రాలు అంచనా వేస్తున్నారు. అదేమిటంటే, ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 1600 నిట్స్ బ్రైట్నెస్ మరియు HDR 10+ సపోర్ట్ కలిగిన AMOLED స్క్రీన్ తో వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ ఫోన్ డిజైన్ గురించి కంపెనీ గొప్పగా చెబుతోంది మరియు ఇమేజ్ ద్వారా ఆ విషయం కన్ఫర్మ్ చేస్తోంది. ఈ ఫోన్ చాలా స్లీక్ కనిపిస్తోంది మరియు సరికొత్త కర్వుడ్ బ్యాక్ ప్యానల్ తో కనిపిస్తోంది. ఈ ఫోన్ పై నెట్టింట్లో చెక్కర్లు కొడుతున్న లీక్స్ మరియు రూమర్స్ ద్వారా ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 5G చిప్ సెట్ తో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.
ఇది కాకుండా ఈ ఫోన్ బ్యాటరీ మరియు ఛార్జ్ సపోర్ట్ గురించి కూడా అంచనా వేసి చెబుతున్నారు. అదేమిటంటే, ఈ ఫోన్ 50W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ అవుతుందని కూడా అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉండవచ్చని, అందులో 50MP మెయిన్ కెమెరా ఉండవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.