CMF Phone 1 ఫోన్ కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్.!
CMF Phone 1 ఫోన్ కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్
ఈ నథింగ్ సబ్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ నెక్స్ట్ సేల్ రేపు జరుగుతుంది
ఈ ఫోన్ మొదటి సేల్ నుండి హాట్ హాట్ గా ఫోన్స్ అమ్ముడయ్యాయి
CMF Phone 1 ఫోన్ కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. బడ్జెట్ ధరలో సరికొత్త డిజైన్ మరియు ఆకర్షణీయమైన ఫీచర్స్ తో వచ్చిన ఈ నథింగ్ సబ్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ నెక్స్ట్ సేల్ రేపు జరుగుతుంది. ఈ ఫోన్ మొదటి సేల్ నుండి హాట్ హాట్ గా ఫోన్స్ అమ్ముడయ్యాయి. అయితే, ఇప్పుడు ఈ ఫోన్ రెండవ సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది.
SurveyCMF Phone 1 : సేల్
సిఎంఎఫ్ ఫోన్ 1 సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు Flipkart నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ పైన Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మరియు EMI పైన రూ. 1,000 అదనపు డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది.
CMF Phone 1 : ధర
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ తో ఉంటుంది మరియు దీని ధర రూ. 15,999. ఈ ఫోన్ యొక్క రెండవ వేరియంట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ తో ఉంటుంది మరియు దీని ధర రూ. 17,999. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, లైట్ గ్రీన్ మరియు ఆరెంజ్ నాలుగు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.
Also Read: ఈరోజు లభిస్తున్న బెస్ట్ 55 ఇంచ్ Smart Tv డీల్స్ పై ఒక లుక్కేయండి.!
సిఎంఎఫ్ ఫోన్ 1: ఫీచర్లు
సిఎంఎఫ్ ఫోన్ 1 స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ సూపర్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ బ్రైట్నెస్ మరియు HDR 10+ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300 5G ప్రోసెసర్ పని చేస్తుంది. అంతేకాదు, 8GB ఫిజికల్ ర్యామ్ మరియు 8GB ర్యామ్ బూస్టర్ తో మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి వుంది.

ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ సెటప్ లో EIS సపోర్ట్ కలిగిన 50MP Sony IMX882 మెయిన్ కెమెరా + 2MP కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ తో 30 fps వద్ద 4K వీడియోలు షూట్ చేసే వీలుంది మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ Nothing OS 2.6 సాఫ్ట్ వేర్ తో Android 14 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ ను 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000mAh బిగ్ బ్యాటరీతో అందించింది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile