లావా అగ్ని 2 నెక్స్ట్ సేల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.!

HIGHLIGHTS

లావా అగ్ని 2 నెక్స్ట్ సేల్ ను కంపెనీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది

ఈ ఫోన్ అప్ కమింగ్ సేల్ మరియు కొత్త వివరాలు ట్విట్టర్ అకౌంట్ నుండి ట్వీట్ చేసింది

Lava Agni 2 ఫోన్ సేల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది

నిన్న సేల్ నుండి లావా అగ్ని 2 5G స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చెయ్యలేక నిరాశ చెందారా? అయితే, మీ కోసమే ఈ గుడ్ న్యూస్. లావా అగ్ని 2 నెక్స్ట్ సేల్ ను కంపెనీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. జూన్ 7 వ తేదీ ఈ స్మార్ట్ ఫోన్ మరొకసారి సేల్ కి అందుబాటులోకి వస్తుందని కంపెనీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి ట్వీట్ చేసింది. అయితే., ఈ ట్వీట్ లో ఫోన్ రేట్ రూ.21,999 ధరతో సూచించింది. ఈ ఫోన్ అప్ కమింగ్ సేల్ మరియు కొత్త వివరాలు ఏమిటో తెలుసుకోండి.    

లావా చేసిన నెక్స్ట్ సేల్ టీజర్ లో ఈ ఫోన్ ధరను రూ.21,999  గా వెల్లడించింది. ఇది లాంచ్ ధర అయినా కూడా లావా అందించినా లాంచ్ అఫర్ ద్వారా 2,000 రూపాయల డిస్కౌంట్ తో అందుకునే వీలు కల్పించింది. గత సేల్ నుండి కూడా ఈ ఫోన్ పైన లావా రూ.2,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ ని జత చెయ్యడం ద్వారా ఈ ఫోన్ ను రూ.19,999 ధరకే కొనుగోలు చేసే అవకాశం ఇచ్చింది. అయితే, జూన్ 7 న జరగనున్న సేల్ నుండి బహుశా ఈ బ్యాంక్ అఫర్ అందుబాటులో ఉండక పోవచ్చని భావిస్తున్నారు. 

ఇటీవల జరిగిన రెండు సేల్స్ నుండి ఈ ఫోన్ నిముషాల్లో అమ్ముడవ్వడం, ఈ ఫోన్ సేల్ గురించి హాట్ టాపిక్ గా మార్చింది. వాస్తవానికి, ఈ ఫోన్ బడ్జెట్ Curved Display మరియు 1Year Free Replacement అఫర్ లతో యూజర్లను ఆకట్టుకుంటోదని చెబుతున్నారు. అయితే, ఇప్పటి వరకూ ఎన్ని యూనిట్స్ అమ్ముడయ్యాయి అనే విషయాన్ని మాత్రం కంపెనీ ప్రకటించ లేదు. మరి చూడాలి నెక్స్ట్ సేల్ నుండి ఈ ఫోన్ ఎటువంటి రెస్పాన్స్ అందుకుంటుందో అని.

 

https://twitter.com/LavaMobile/status/1663958160288399360?ref_src=twsrc%5Etfw

 

ఈ ప్రస్తుతం 20 వేల ధరలో Curved Display మరియు Dimensity 7050 SoC మరియు 256GB స్టోరేజ్ కలిగిన ఏకైక ఫోన్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :