CES 2019 : లెనోవా Z5 ప్రో GT స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 855 తో దర్శనమిచ్చింది

CES 2019 : లెనోవా Z5 ప్రో GT స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 855 తో దర్శనమిచ్చింది
HIGHLIGHTS

ఒక 6.39 అంగుళాల FHD + సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో ఉంటుంది

లెనోవా Z5 ప్రో GT,  మొదటి క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 855 ప్రాసెసర్ కలిగిన లెనోవా సంస్థ ఫోన్. ఇది కొన్ని వారాల క్రితం చైనాలో విడుదలైంది మరియు ఇప్పుడు  CES 2019 లో చేరింది. ఇది ZUI 10.0 తో Android 9.0 OS పై నడుస్తుంది.

దీనిగురించి చెప్పాలంటే, ఇది కార్నింగ్  గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో  19: 9 ఆస్పెక్ట్ రేషియాతో, ఒక 6.39 అంగుళాల FHD + సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో ఉంటుంది. ఈ లెనోవా Z5 ప్రో GT వెనుక డ్యూయల్ కెమెరా సెటప్పుతో, 16MP మరియు 24MP కెమెరా సెన్సార్లతో పాటుగా ఒక LED ఫ్లాష్ కలిగి ఉంది. ఇది కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ కలిగివుంటుంది మరియు POCO F1 ఆర్మర్డ్ ఎడిషన్ బ్యాక్ లుక్తో ఉన్న ఫోన్ను గుర్తుకు తెస్తుంది.

దాని ముందు కెమెరా గురించి మాట్లాడితే , ఇందులో సెల్ఫీ కోసం 16MP మెగాపిక్సెల్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచర్ కోసం 8MP IR మెగాపిక్సెల్ సెన్సార్ కలిగి ఉన్న డ్యూయల్  కెమెరా సెటప్పును కలిగి ఉంది. అంతేకాక, అంబియన్ లైట్ మరియు ఇయిర్ పీస్ సెన్సార్లకు ఇందులో ఇచ్చారు.

ఈ లెనోవా Z5 ప్రో GT తో స్మార్ట్ ఫోన్ ఒక 3350mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోటోలో, మీకు చూపిన విధంగా ఈ ఫోన్ ప్రస్తుతం చైనాలో అందుబాటులో ఉంది. ఇది నాలుగు వేరియంట్లలో, 6GB / 128GB, 8GB / 128GB, 8GB / 256GB మరియు 12GB / 512GB లో అందుబాటులో ఉంది కానీ ప్రస్తుతం వీటి ఖరీధు తెలియదు. భారతదేశంలో ఈ ఫోన్ విడుదలను గురించి మరింత సమాచారం ప్రస్తుతానికి లేదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo