BSNL త్వరలో క్లోజ్ చేయబోతున్న ఈ బడ్జెట్ సూపర్ ప్లాన్ గురించి మీకు తెలుసా.!
BSNL ఇటీవల అందించిన ఒక ప్రీపెయిడ్ ప్లాన్ మరో వారం రోజుల్లో క్లోజ్ అవుతుంది
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను గత నెల చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రకటించింది
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజులకు 100 GB అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది
BSNL ఇటీవల అందించిన ఒక ప్రీపెయిడ్ ప్లాన్ మరో వారం రోజుల్లో క్లోజ్ అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను గత నెల చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రకటించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను చాలా చవక ధరలో భారీ డేటా మరియు మరిన్ని అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందించే విధంగా ఈ ఫోన్ ను తన యూజర్ల కోసం అందించింది. ఇది స్టూడెంట్ అవసరాలకు తగిన విధంగా అందించిన స్టూడెంట్ ప్లాన్.
SurveyBSNL క్లోజ్ చేయబోతున్న ప్లాన్ ఏమిటి?
బీఎస్ఎన్ఎల్ రీసెంట్ గా విడుదల చేసిన కొత్త రూ. 251 స్టూడెంట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుకుంటుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఒక్క నెల గడువు తో వచ్చిన లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మరియు ఈ ఆఫర్ డిసెంబర్ 13వ తేదీ తో క్లోజ్ అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు అందుకునే కంప్లీట్ బెనిఫిట్స్ ఇప్పుడు చూద్దాం.
BSNL రూ. 251 ప్రీపెయిడ్ ప్లాన్
ఈ బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తిగా 28 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్ అవుతుంది. ఎందుకంటే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజులకు 100 GB అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది. అంటే, డైలీ లిమిట్ లేకుండా అవసరాన్ని బట్టి 100 జీబీ హై స్పీడ్ డేటాని ఉపయోగించవచ్చు. ఇదే కాదు ఈ ప్లాన్ తో 28 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది. ఇది ఓవరాల్ బెనిఫిట్స్ అందించే ప్రీపెయిడ్ ప్లాన్ మరియు అధిక డేటా కోరుకునే వారికి తగిన ప్లాన్ అవుతుంది.

ఈ ప్లాన్ మరో వారం రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందుకే, అధిక డేటా కొరుకునే యూజర్లు ఈ ప్లాన్ క్లోజ్ అయ్యేలోపు ఈ ప్లాన్ రీఛార్జ్ చేయడం ద్వారా ఈ ప్లాన్ లాభాలు అందుకోవచ్చు. ఇక మరింత చవక ధరలో అధిక డేటా మరియు అన్లిమిటెడ్ లాభాలు ఎక్కువ వ్యాలిడిటీ తో కోరుకునే యూజర్లు రూ. 347 ప్లాన్ చూడవచ్చు.
Also Read: Samsung 5.1 Dolby సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈరోజు సగం ధరకే సేల్ అవుతోంది.!
బీఎస్ఎన్ఎల్ రూ. 347 ప్రీపెయిడ్ ప్లాన్
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ బడ్జెట్ ధరలో వచ్చే 50 రోజుల వ్యాలిడిటీ అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 50 ర్పజులు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2 జీబీ హై స్పీడ్ డేటా మరియు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనాలు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో డైలీ వచ్చే డైలీ హై స్పీడ్ డేటా లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది.