bolt launching Boltt Ace and evo first smartphones in india
ప్రముఖ భారతీయ కన్స్యూమర్ టెక్ బ్రాండ్ బోల్ట్ ఇప్పుడు మొబైల్ మార్కెట్ లోకి కూడా అడుగుపెడుతోంది. Boltt Ace మరియు Evo పేరుతో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన బోల్ట్, ఈ ఫోన్ లను ఇదే నెలలో లాంచ్ చేయడానికి డేట్ మరియు టైమ్ కూడా ఫిక్స్ చేసింది. స్మార్ట్ ఫైన్ ప్రైస్ పెరగడంతో మార్కెట్ లో కాంపిటీషన్ పెరిగిన ఈ రోజుల్లో బోల్ట్ ఈ ఫోన్లను ఎలాంటి ప్రైస్ అండ్ ఫీచర్స్ తో లాంచ్ చేస్తుందో, అని సర్వత్రా చర్చ జరుగుతోంది.
బోల్ట్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లను ఆగస్టు 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ యూనిక్ ఫోన్స్ గా లాంచ్ చేస్తోంది మరియు లాంచ్ తర్వాత ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి తీసుకు వస్తుంది.
బోల్ట్ లాంచ్ చేయనున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి నిన్నటి వరకు ఎలాంటి వివరాలు అందించలేదు. అయితే, ఈరోజు ఈ ఫోన్ డిజైన్ మరియు కీలక ఫీచర్స్ కూడా వెల్లడించింది. ఇక ఈ ఫోన్స్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ రెండు ఫోన్లలో ఏస్ ఫోన్ 5G ఫోనుగా వస్తుంది. ఈ ఫోన్ రౌండ్ కార్నర్ మరియు స్లీక్ డిజైన్ తో ఉంటుంది.
బోల్ట్ ఏస్ స్మార్ట్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది.. ఈ కెమెరా సెటప్ ఫోన్ వెనుక భాగంలో ఉన్న పెద్ద బంప్ లో అందించింది. అలాగే, ఈ ఫోన్ లో ముందు సెంటర్ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ కెమెరాతో పాటు ఫ్లాష్ లైట్ ఉన్నట్లు కూడా కనిపిస్తోంది. ఈ ఫోన్ 9.49mm మందంతో కొంచెం మందంగా ఉంటుంది.
ఇక బోల్ట్ ఏవో స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ 4G ఫోన్ గా వస్తుంది. ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ వెనుక గ్లాసీ బ్యాక్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను డైలీ యూసేజ్ స్ట్రాంగ్ డిస్ప్లేతో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ స్లీక్ ఫ్లాట్ డిజైన్ లో ఉంటుంది.
Also Read : CMF Clip Pro : మార్కెట్ ఎన్నడూ చూడని సరికొత్త డిజైన్ కొత్త బడ్స్ లాంచ్ చేసిన నథింగ్.!
ఈ రెండు ఫోన్స్ మైన ఫీచర్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ ఫోన్స్ లాంచ్ కోసం ఇంకా సమయం ఉంది కాబట్టి, ఈ ఫోన్స్ మెయిన్ ఫీచర్స్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది.