CMF Clip Pro : మార్కెట్ ఎన్నడూ చూడని సరికొత్త డిజైన్ లో కొత్త బడ్స్ లాంచ్ చేసిన నథింగ్.!
నథింగ్ లేటెస్ట్ గా ఆడియో డివైజ్ CMF Clip Pro విడుదల చేసింది
మార్కెట్ ఎన్నడూ చూడని సరికొత్త డిజైన్ తో లాంచ్ చేయడం విశేషం
జంతా చెవుల్లో ధరించి ఉంచినా కూడా ఇబ్బంది కలిగించని డిజైన్ తో అందించింది
CMF Clip Pro : ప్రముఖ UK స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నథింగ్ లేటెస్ట్ గా ఆడియో డివైజ్ సిఎంఎఫ్ క్లిప్ ప్రో విడుదల చేసింది. ఈ కొత్త ఆడియో ప్రోడక్ట్ ని మార్కెట్ ఎన్నడూ చూడని సరికొత్త డిజైన్ తో లాంచ్ చేయడం విశేషం. ఈ బడ్స్ ని రోజంతా చెవుల్లో ధరించి ఉంచినా కూడా ఇబ్బంది కలిగించని డిజైన్ తో అందించింది. ఈ బడ్స్ బాక్స్ డిజైన్ కూడా మార్కెట్ లో ఉన్న ఇయర్ బడ్స్ కి పూర్తి భిన్నమైన డిజైన్ తో అందించింది. అయితే, ఇది UK మార్కెట్లో మాత్రమే లాంచ్ అయ్యింది.
SurveyCMF Clip Pro : ఫీచర్స్
ఈ కొత్త ఇయర్ బడ్స్ ను కొత్త ఓపెన్ ఇయర్ డిజైన్ లో అందించింది. ఇది ఓపెన్ ఇయర్ డిజైన్ అయినా కూడా రియల్ సౌండ్ అందిస్తుంది. ఇది చెవులకు క్లిప్ లాగా తగిలించే డిజైన్ ఉంటుంది మరియు చాలా లైట్ వైట్ తో వస్తుంది. ఈ బడ్స్ లో 10.8mm డ్యూయల్ మాగ్నెట్ తో వస్తుంది. అంతేకాదు, ఇది TPU డైఫాగ్రామ్ తో మరింత అద్భుతమైన సౌండ్ అందిస్తుంది. ఇందులో ఉన్న ఇంటిగ్రేటెడ్ అల్ట్రా బాస్ టెక్నాలజీ గొప్ప బాస్ సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది మరియు బాస్ లవర్స్ కి సూపర్ గా ఉంటుంది.

ఇక సౌండ్ సపోర్ట్ మరియు ఏక్ విషయానికి వస్తే, ఇందులో హై క్వాలిటీ వైర్‌లెస్ ఆడియో కోసం LDAC తో పాటు Hi-Res వైర్‌లెస్ ఆడియో, AAC మరియు SBC సపోర్ట్ కూడా అందించింది. స్టాటిక్ స్పేషియల్ ఆడియో, 1 కస్టమ్ ఈక్వలైజర్ మరియు 5 ప్రత్యేకమైన ఈక్వలైజర్ మోడ్స్ కూడా అందించింది. ఇది గూగుల్ ఫాస్ట్ పెయిర్, లో ల్యాగ్ మోడ్, మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ పెయిర్ వంటి మరిన్ని ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో ఫైండ్ మై ఇయర్ బడ్స్ ఫీచర్ కూడా ఉంది.
కాలింగ్ ఫీచర్స్ ఫీచర్స్ పరంగా, ఈ బడ్స్ లో మొత్తం 4HD మైక్స్ ఉంటాయి. ఈ మైక్స్ తో పాటు బ్యాగ్రౌండ్ నోయిస్ ను తగ్గించి మంచి క్లియర్ వాయిస్ అందించే క్లియర్ వాయిస్ టెక్నాలజీ ప్రాసెస్ కూడా ఈ బడ్స్ లో ఉంది. కనెక్టివిటీ పరంగా ఇది బ్లూటూత్ 5.4 వెర్షన్ సపోర్ట్ తో వస్తుంది. ఈ బడ్స్ లో స్మార్ట్ డయల్ ఉంటుంది మరియు ఇది మంచి ఫంక్షన్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
ఈ లేటెస్ట్ సిఎంఎఫ్ క్లిప్ ప్రో గురించి సింపుల్ గా చెప్పాలంటే ఇది న్యూ అండ్ స్టైల్ డిజైన్ తో పాటు గొప్ప సౌండ్ అందించే సెటప్ కలిగిన బడ్స్ గా చెప్పవచ్చు.
Also Read : Sony, LG మరియు TCL టాప్ Smart Tv లపై జబర్దస్త్ ఆఫర్స్ .. అమెజాన్ సేల్ గుడ్ న్యూస్.!
CMF Clip Pro : ప్రైస్
నథింగ్ ఈ బడ్స్ ను UK మార్కెట్ లో £79 (సుమారు రూ. 10,199) ధరతో లాంచ్ చేసింది. అయితే, ఇండియాలో ఈ బడ్స్ లాంచ్ గురించి ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
