Xiaomi యొక్క Black Shark గేమింగ్ ఫోన్ 13 ఏప్రిల్ న లాంచ్….

Xiaomi యొక్క Black Shark గేమింగ్ ఫోన్  13 ఏప్రిల్ న లాంచ్….

ఇటీవలే స్థాపించబడిన బ్లాక్ షార్క్ టెక్నాలజీస్ స్నాప్డ్రాగెన్ 845 మొబైల్ ప్లాట్ఫారమ్ గేమింగ్ స్మార్ట్ఫోన్ త్వరలో ప్రారంభించనున్నట్లు ధృవీకరించింది. అధికారిక ఇన్విటేషన్  పోస్టర్ బ్లాక్ షార్క్ గేమింగ్ ఫోన్ ఏప్రిల్ 13 న ప్రారంభించబడుతుందని చూపిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

పోస్టర్ Xiaomi యొక్క ఇన్వెస్టిమెంట్ డిపార్టుమెంట్ పార్టనర్  ఇన్విటేషన్  చూపిస్తుంది, Gizmochina రిపోర్ట్ ప్రకారం ఈ ఫోన్ ని  ఏప్రిల్ 13 న చైనాలో 3 గంటలకు ప్రారంభించనున్నారు. 

గత కొద్ది రోజుల్లో ఈ ఫోన్ కి  సంబంధించి చాలా సమాచారం వచ్చింది .  ఇది మొదట AnTuTu కోడ్నేమ్ "BlackShark" తో కనిపించింది. ఈ పరికరం స్నాప్డ్రాగెన్ 845 SoC, 8 GB RAM, మరియు Android 8.0 Oreo తో Geekbench పై  కనిపించింది .

గత వారం వెల్లడైన  సమాచారం ప్రకారం, ఈ స్మార్ట్ఫోన్ మూడు వేరియంట్స్  ప్రారంభించబడుతుంది. ఒక వేరియంట్లో 6 GB RAM మరియు 128 GB స్టోరేజ్ ఉంటుంది, ఇతర రెండు రకాల్లో 8 GB RAM మరియు 128 GB స్టోరేజ్  లేదా 256 GBస్టోరేజ్  ఉంటుంది. బ్లాక్ షార్క్ గేమింగ్ ఫోన్ క్విక్  ఛార్జ్ 3.0 రాపిడ్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది. Razer ఫోన్ లాగా, బ్లాక్ షార్క్ గేమింగ్ ఫోన్ ఒక 120Hz ప్రదర్శనతో రావచ్చు.

 

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo