Oppo R17 Pro పైన 6,000 రూపాయల భారీ తగ్గింపు

Oppo R17 Pro పైన 6,000 రూపాయల భారీ తగ్గింపు
HIGHLIGHTS

ఈ ఫోన్ ఒక ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది

చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీదారు Oppo దాని ఇటీవల తీసుకొచ్చిన మధ్యస్థాయి స్మార్ట్ ఫోన్ అయినటువంటి  R17 ప్రో పైన రూ. 6,000 ధర తగ్గించింది. ముందుగా, ఈ స్మార్ట్ ఫోన్  రూ 45,990 ధరతో డిసెంబర్ లో ప్రారంభించబడింది మరియు ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ రూ 39,990 ధర వద్ద అందుబాటులో ఉంది. షావోమి, శామ్సంగ్, మరియు వివో వంటి సంస్థలు వాటి యొక్క కొత్త స్మార్ట్ ఫోన్లను సరసమైన ధరలతో మార్కెట్లోకి తీసుకువరవడంతో, Oppo దాని స్మార్ట్ఫోన్ల ధరలను తగ్గించాల్సివచ్చింది. షావోమి కూడా దాని Redmi Note 7 మరియు Note 7 Pro లను ప్రారంభించింది.

శామ్సంగ్ గడచిన నెలలో, భారతదేశంలో ఆరు కొత్త స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్ఫోన్లు, గెలాక్సీ M10, M20, మరియు M30 మరియు గెలాక్సీ A సిరీస్ నుండి  A10, A30, మరియు A50 డివైజెస్. ఇక వివో విషయానికి వస్తే, ముందే ఆ సంస్థ భారతదేశంలో వివో V15 ప్రో స్మార్ట్ ఫోన్ను ప్రారంభించింది.  OPPO R17 ప్రో రూ 39.990 కొత్త ధర ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ లో కూడా అందుబాటులో ఉన్నాయి.

ఒప్పో R17 ప్రో : ప్రత్యేకతలు మరియు లక్షణాలు

ఒప్పో R17 ప్రో,  2340×1080 పిక్సెల్స్ యొక్క రిజల్యూషన్ మరియు 19: 9 యాస్పెక్ట్ రేషియాతో ఒక 6.4-అంగుళాల ఫుల్ HD + AMOLED డిస్ప్లే కలిగి ఉంది. డిస్ప్లేలో "వాటర్ డ్రాప్ " నోచ్ ఉంది, ఇది ఈ ఫోన్ 91.5 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోని సాధించడానికి సహయపడుతుంది. ఫోన్ యొక్క డిస్ప్లేలో ఒక ఇన్ బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది మరియు ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 రక్షణతో వస్తుంది. ఈ ఒప్పో సామ్రాట్ ఫోన్, కేవలం 0.41 సెకన్లలో స్మార్ట్ ఫోన్నిసమర్ధవంతంగా అన్లాక్ చేస్తుంది.

ఒప్పో R17 ప్రో ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710 SoC (డ్యూయల్ 2.2GHz Kryo 360 + Hexa 1.7GHz Kryo 360 CPU లు) శక్తితో మరియు అడ్రినో 616 GPU గ్రాఫిక్స్ తో కలిసి ఉంటుంది. ఒక 8GB RAM + 128GB స్టోరేజి వేరియంట్, Android 8.1 (Oreo)తో స్మార్ట్ ఫోన్ వస్తుంది మరియు ColorOS 5.2 పై అమలవుతుంది.

ఫోటోగ్రఫీ పనితీరు విషయానికి వస్తే,  వెనుక డ్యూయల్ – కెమెరా సెటప్ మరియు ముందు ఒకే కెమేరా ఇవ్వబడ్డాయి. వెనుకభాగంలో, ప్రాధమిక 12MP కెమెరా వేరియబుల్ ఎపర్చరు (f / 1.5 మరియు f / 2.4) తో వస్తుంది, అది కాంతి లభ్యతపై ఆధారపడి మారుతుంది. ద్వితీయ 20MP కెమెరా పోర్ట్రైట్ షాట్లు తీయడంలో  సహాయపడుతుంది. ఇది టైమ్ ఆఫ్ ఫ్లైట్ (TOF) 3D సెన్సింగ్ టెక్నాలజీని కలిగి ఉంది, ఇవి నానో సెకండ్  ఇన్ఫ్రారెడ్  మెజెర్మెంట్ ద్వారా అధిక-లోతైన 3D డెప్త్  సమాచారం పొందవచ్చు. ముందు 25MP AI కెమెరాని అందించారు.

ఒప్పో R17 ప్రో,  ఒక SuperVOOC ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీతో  3,700mAh బ్యాటరీ కలిగి వుంది.  ఇది మొదటిగా ఈ సంవత్సరం ఫైండ్ X లంబోర్ఘిని ఎడిషన్ లో  తీసుకొచ్చింది  మరియు అలాగే తర్వాత Oppo F9 ప్రో  కోసం కూడా దారివేసింది. సాంకేతిక పరిజ్ఞానంతో,  కేవలం 10 నిముషాలలో ఫోన్ 0 నుండి 40 శాతం వరకు  ఛార్జ్ చేయవచ్చునని Oppo చెబుతోంది. ఇటీవల, ఒక నివేదిక ఒప్పో R17 ప్రో వేగంగా ఛార్జింగ్ చేయగలిగిన ఫోన్ అని పేర్కొంది . ఇది Oppo R17 ప్రో ఇతర 59 స్మార్ట్ ఫోన్లకు పోటీనిస్తుంది మరియు సంస్థ యొక్క ఈ SuperVOOC ఫ్లాష్ కేవలం 30 నిమిషాల్లో ఈ ఛార్జింగ్ టెక్నాలజీతో 3700mAh సామర్ధ్యం కలిగిన ఈ బ్యాటరీని 92 శాతానికి ఛార్జ్ చేస్తుందని చెప్పారు.

గమనిక: డిజిట్ తెలుగు ఇప్పుడు టెలిగ్రామ్ నుండి కూడా అందుబాటులో ఉంది.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo