ఇండియాలోని బెస్ట్ 5 స్మార్ట్ ఫోన్స్ : 15,000 రూపాయల ధరలో

ఇండియాలోని బెస్ట్ 5 స్మార్ట్ ఫోన్స్ : 15,000 రూపాయల ధరలో
HIGHLIGHTS

గొప్ప స్పెక్స్ మరియు లక్షణాలతో ఇండియాలో అందుబాటులోవున్న 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్లను పరిశీలిద్దాం.

ప్రస్తుతం 15,000 రూపాయల ధరలో వున్నా స్మార్ట్ ఫోన్లపైన, వినియోగదారులు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. కాబట్టి, ఈ ధర పరిధిలో ఒక మంచి ఫోన్ కొనుగోలు చేరాలనుకునే వారికీ ఈ జాబితా, ఒక ఎంపిక ఎంచుకోవడానికి  సహాయపడుతుంది. అన్నివిభాగాలలో, ప్రత్యేకత కలిగివున్న ఫోనాలను ఇక్కడ మీ కోసం ఒక జాబితాగా అందిస్తున్నాము.  గొప్ప స్పెక్స్ మరియు లక్షణాలతో ఇండియాలో అందుబాటులోవున్న 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్లను పరిశీలిద్దాం.

హానర్ 8 X

హానర్ 8X  పెద్ద డిస్ప్లే మరియు వాటి అంచులు దాదాపు అన్ని వైపులా విస్తరిస్తాయి మరియు పైన నోచ్ ఉంటుంది, ఇందులోని నోచ్ ఇతర ఫోన్లలోలాగా పెద్దగా ఉండదు. హానర్ 8X కేవలం ఒక పెద్ద స్క్రీన్ కలిగిన ఫోన్ మాత్రమేకాదు, ఇది సరికొత్త కిరిన్ 710 SoC శక్తితో అధికమైన పనితీరును చేస్తుంది. అలాగే, దీనిలో AI బాగా పనిచేస్తుంది కెమేరా విభాగంలో కూడా అద్భుతంగా ఆకట్టుకుంటుంది ఈ ఫోన్.

మోటో వన్ పవర్

షావోమి కంపెనీ నుండి వస్తున్నా పోటీకి మోటో నుండి సరైన సమాధానంగా వచ్చిన స్మార్ట్ ఫోనుగా ఈ మోటో వన్ పవర్ ను చెప్పొచ్చు.  ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు స్టాక్ ఆండ్రాయిడ్ తో వస్తుంది. ఇది 4GB మరియు 64GB తో పెర్ఫార్మెన్స్ పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది కాబట్టే 15000 రూపాయల ధర విభాగంలో ఇది కూడా తన స్థానాన్ని నిలబెట్టుకుంది.                

రియల్మీ 2 ప్రో

రియల్మీ నుండి వచ్చిన ఈ  రియల్మీ 2 ప్రో,  స్మార్ట్ ఫోనులో కొత్తధనాన్నికోరుకుంటున్నయూత్ కోసం తీసుకొచ్చినట్లు రియల్మీ తెలిపినది. ఇందులో, డిమాండ్ లో ఉన్న అన్నిలక్షణాలను తెచ్చింది ఇందులో- కెమెరా లో పోర్ట్రైట్ మోడ్, డ్యూ డ్రాప్ డిస్ప్లే, మరియు ఈ ధరలో ఒక స్నాప్ డ్రాగన్ 660 ఆక్టా కోర్ ప్రాసెసరును తీసుకొచ్చింది. అధిక మొత్తంలో, ఈ రియల్మీ 2 ప్రో అమ్మకాలను సాగించినట్లు కూడా కంపెనీ తెలిపింది.

షావోమి మి A2

షావోమి మి A2 కూడా దాదాపుగా నోకియా 7 ప్లస్ వంటి  వివరాలను కలిగి ఉంది , కానీ ఇది తక్కువ ధరలో వస్తుంది. Mi A2  వెనుకభాగంలో ఒక అద్భుతమైన డ్యూయల్ కెమెరా కూడా కలిగిఉంది. అదనంగా,  Android One ధృవీకరణ కలిగివుంది అంటే ఇది ఆండ్రాయిడ్ 9 పై సహా, సాధారణ అప్డేట్లకు హామీ ఇస్తుంది .ప్రస్తుతం ఇది Android 9 Pie యొక్క అప్డేట్ కూడా పొందింది.  ఇది కూడా ఒక స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ మరియు 4GB RAM, 64GB స్టోరేజితో చాలా చక్కగా ఉంది.

అసూస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో M 1

ఈ అసూస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో M 1 దాదాపుగా షావోమి రెడ్మి నోట్ 5 ప్రో వలెనే ఉంటుంది. కానీ ఈ స్మార్ట్ ఫోన్ అదనంగా స్టాక్ ఆండ్రాయిడ్ తో వస్తుంది ఇది ఈ ఫోను యొక్క విలువను అమాంతంగా పెంచుతుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 636 క్రయో ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు స్టాక్ ఆండ్రాయిడ్ తో వస్తుంది మరియు దీని ధర కూడా తక్కువగా ఉంటుంది.ఇక కెమేరాలను చూస్తే, వెనుక డ్యూయల్ 16+5MP మరియు ముందు 16 MP కెమెరా మరియు 5000 mAh బయటరీతో ఆకట్టుకుంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo