బడ్జెట్ ధరలో 108MP కెమెరా ఫోన్ కొనాలనుకునే వారికి శుభవార్త. ఎందుకంటే, మోటోరోలా ఇటీవల ఇండియాలో విడుదల చేసిన 108MP క్వాడ్ ఫిక్షన్ కెమెరా ఫోన్ ఇప్పుడు 3,000 రూపాయల భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ Flipkart నుండి కేవలం 15 వేల కంటే తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ FHD+ HDR 10 సపోర్ట్ కలిగిన గొప్ప డిస్ప్లేతో పాటుగా బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఆల్రౌండ్ ఫీచర్లతో వస్తుంది. లాభాదాయకమైన ఈ స్మార్ట్ ఫోన్ డీల్ పైన ఒక లుక్ వేయండి.
Survey
✅ Thank you for completing the survey!
Moto G60: అఫర్ ధర
మోటో జి60 స్మార్ట్ ఫోన్ ఇండియాలో కేవలం (6GB + 128GB) సింగిల్ వేరియంట్ తో లభిస్తుంది మరియు లాంచ్ సమయంలో Rs.17,999 రేటు వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు Flipkart నుండి 3,000 రూపాయల భారీ తగ్గింపుతో కేవలం రూ.14,999 రూపాయల ధరకే లభిస్తోంది.
Moto G60 స్మార్ట్ ఫోన్ మోటో G60 కొంచెం పెద్దదైన 6.78- ఇంచ్ పరిమాణం కలిగిన FHD+ HDR 10 సపోర్ట్ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేటుతో పాటుగా పంచ్ హోల్ కెమేరా డిజైనుతో కలిగి ఉంటుంది. అలాగే, మోటో G60 స్మార్ట్ ఫోన్ 2.3 GHz వరకూ క్లాక్ స్పీడ్ అందించగల క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 732G తో వస్తుంది. ఇది మంచి పవర్ ఎఫిషియంట్ మరియు గేమింగ్ ప్రొసెసర్. ఈ స్మార్ట్ ఫోన్ ఎటువంటి బ్లోట్ వేర్ లేకుండా స్టాక్ ఆండ్రాయిడ్ 11 OS తో పనిచేస్తుంది.
మోటో G60 లో వెనుక క్వాడ్ ఫిక్షన్ కెమెరా ఉంటుంది. ఇందులో, 108MP మైన్ కెమెరాకి జతగా 8MP అల్ట్రా వైడ్&మ్యాక్రో సెన్సార్ మరియు 2MP డెప్త్ సెన్సార్ ఉంటాయి.ఈ స్మార్ట్ ఫోన్ లో సెల్ఫీల కోసం 32MP సెల్ఫీ కెమెరాని మోటో అందించింది. ఇక మోటో G 60 ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఇది ఒక పెద్ద 6000mAh బిగ్ బ్యాటరీని 20W టర్బో/క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 4.0 సపోర్ట్ తో కలిగి వుంటుంది.