20 వేల ధరలో 4K వీడియో రికార్డింగ్ తో వచ్చే బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ గురించి తెలుసా.!

Updated on 06-Jun-2023
HIGHLIGHTS

20 వేల ధరలో 4K వీడియో రికార్డింగ్ తో వచ్చే బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్

భారతీయ మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ లకు కొదవే లేదు

4K వీడియో రికార్డ్ చెయ్యగల సత్తా కలిగిన 5G స్మార్ట్ ఫోన్లు

20 వేల ధరలో 4K వీడియో రికార్డింగ్ తో వచ్చే బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ గురించి తెలుసా? ఒకవేళ తెలియకుంటే ఈరోజు తెలుసుకోండి. భారతీయ మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ లకు కొదవే లేదు. కానీ, 20 వేల రూపాయల ధరలో 4K వీడియో రికార్డ్ చెయ్యగల సత్తా కలిగిన 5G స్మార్ట్ ఫోన్లు మాత్రం కొన్నే ఉన్నాయి. అందుకే, ఈరోజు ఈ 20 వేల రూపాయల బడ్జెట్ కేటగిరిలో 4K రికార్డింగ్ చెయ్యగల కెమేరా సెటప్ కలిగిన 5G స్మార్ట్ ఫోన్స్ గురించి చుడనున్నాము. 

Infinix Zero 5G

ధర రూ. 15,999  
 
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఇంఫినిక్స్ ఇటీవల ప్రకటించిన Infinix Zero 5G స్మార్ట్ ఫోన్ 50MP + 2MP + 2MP ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్ తో వస్తుంది మరియు 4K (30fps) వద్ద రికార్డ్ చేయగలదని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ బిగ్ FHD+ AMOLED డిస్ప్లే, 8GB ర్యామ్, 128GB స్టోరేజ్, 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు Dimensity 920 ప్రోసెసర్ వంటి ఫీచర్లను కలిగి వుంది. ఈ ఫోన్ 15 వేల ధరలో డ్యూయల్ 5G మరియు 4K వీడియో రికార్డ్ సపోర్ట్ ను కలిగి వుంది. Buy From Here

iQOO Z7 5G

ధర రూ. 18,999

ఈ ఐకూ స్మార్ట్ ఫోన్ 64MP (OIS) + 2MP డ్యూయల్ రియర్ కెమేరాని 4K (30fps) సపోర్ట్ తో కలిగి వుంది. ఈ స్మార్ట్ ఫోన్ HDR 10+ సపోర్ట్ మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన బిగ్ FHD+ AMOLED డిస్ప్లేని కలిగి వుంది. ఈ ఫోన్ 6GB ర్యామ్,128GB స్టోరేజ్, 44 ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో 5000 mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 OS,  Dimensity 920 ప్రోసెసర్ మరియు 6GB వరకూ ఎక్స్ టెండెడ్ ర్యామ్ సపోర్ట్ ను కలిగి వుంది. ఈ ఫోన్ 20 వేల లోపల డ్యూయల్ 5G సపోర్ట్ మరియు 4K వీడియో రికార్డ్ సపోర్ట్ తో వచ్చే స్మార్ట్ ఫోన్ లలో ఒకటిగా నిలుస్తుంది. Buy From Here

Redmi K50i 5G             

ధర రూ. 20,999

ఈ షియోమి స్మార్ట్ ఫోన్ 64MP + 8MP + 2MP ట్రిపుల్ రియర్ కెమేరాని 4K (30fps) సపోర్ట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 8100 SoC, 6GB LPDDR5 ర్యామ్, 128GB స్టోరేజ్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు Dolby Vision సపోర్ట్ కలిగిన బిగ్ Liquid FFS డిస్ప్లే, Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్లు మరియు 67W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి వుంది. Buy From Here

Lava Agni 2 5G

ధర రూ. 21,999

ఈ లిస్ట్ లో భారతీయ మొబైల్ Lava Agni 2 5G కూడా నిలిచింది. ఈ స్మార్ట్ ఫోన్ 50MP + 8MP + 2MP + 2MP క్వాడ్ కెమేరాని 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో కలిగి వుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ బడ్జెట్ ధరలో Curved AMOLED డిస్ప్లే కలిగిన ఏకైక 5G ఫోన్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ Dimensity 7050 SoC, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 66W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన బిగ్ బ్యాటరీ, 8GB+8GB ర్యామ్, 256 మరియు 256GB స్టోరేజ్ వంటి ఫీచర్లను కలిగి వుంది. Buy From Here 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :