ఈ ఫోన్లు వాడితే అత్యధిక రేడియేషన్ మిమ్మల్నివరించినట్లే

ఈ ఫోన్లు వాడితే అత్యధిక రేడియేషన్ మిమ్మల్నివరించినట్లే
HIGHLIGHTS

అత్యధికంగా రేడియేషన్ విడుదల చేస్తున్న ఫోన్లలో చైనా టాప్ బ్రాండ్స్

మనం ప్రతిరోజు ఒక కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రావడం సాధారణమైన విషయంగా మారిపోయింది. అన్ని బ్రాండ్స్ కూడా, మా ఫోనులో ఈ ఫిచర్లున్నాయి, బెస్ట్ స్పెసిఫికేషన్ అందిస్తున్నామని చెబుతున్నాయి. కానీ, ఆ ఫోన్లను వాడడంవలన యెంత రేడియేషన్ వెలువడుతుందన్న విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచుతున్నాయి. కానీ, ఒక పరిశోధనా సంస్థ ఇచ్చిన ప్రమాణాల ఆధారంగా, కొన్ని బ్రాండ్స్ ఫోన్ల యొక్క రేడియేషన్ అత్యధికంగా వుంది.            

ప్రస్తుతం, ఇండియాలో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో No.1 బ్రాండుగా నిలిచినటువంటి Xiaomi ఫోన్లు ప్రజలు అత్యంత ఇష్టపడే ఫోన్లుగా ఉంటాయి. అలాగే, గత సంవత్సరం భారతదేశంలో రూ 40,000 ధర విభాగంలో ప్రజలు OnePlus ఫోన్లను ఎక్కువగా ఎంచుకున్నారు. ఈ బ్రాండ్ ఫోన్లను ప్రజలు ఎక్కువగా ఇష్టపడడానికి కారణం, సరసమైన ధరలో మంచి స్పెక్స్ మరియు ఫిచర్లు అందించడమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా, వాల్యూ -ఫర్-మనీ (డబ్బుకు తగిన విలువ) అందించడం కూడా కారణమని చెప్పబడింది. కానీ ఈ ఫోన్లను వాడుతున్నపుడు,  ఈ ఫోన్ల నుండి విడుదలయ్యే రేడియేషన్ సంగతేమిటో మాత్రం ఎవరికీ  తెలియదు. తాజా గణాంకాల ప్రకారం, కొన్ని Xiaomi మరియు OnePlus ఫోన్లు అత్యధికంగా రేడియేషన్ వెదజల్లే హ్యాండ్సెట్ల జాబితాలో టాప్ గా నిలిచాయి. దీనికి విరుద్ధంగా, దేశంలో ఉన్నత స్థానాన్ని తిరిగి పొందడం కోసం పోరాడుతున్న ఒక సంస్థ అయినటువంటి, శామ్సంగ్ అందించే ఫోన్లు, అతితక్కువ రేడియేషన్ విడుదల చేస్తుండడం విశేషం.

Statista చేసిన సంకలనం సమాచారం ప్రకారం, Xiaomi Mi A1 అత్యంత రేడియేషన్ను అందించే ఫోనుగా ఉంటుంది. ఇక దాని తరువాత,  OnePlus 5T రెండవ స్థానంలో ఉంటుంది. ఇక వరుసగా మూడవ మరియు నాలుగవ స్థానాల్లో Xiaomi Mi Max 3 మరియు OnePlus 6T ఉంటాయి. "వాస్తవానికి, రెండు కంపెనీలు కూడా ఈ జాబితాలో భారీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి, వాటిలో ఉన్న టాప్ 16 హ్యాండ్ సెట్లలో ఎనిమిది వీటివే ఉన్నాయి. ఐఫోన్ 7 వంటి ప్రీమియమ్ ఆపిల్ ఫోన్లు మరియు ఇటీవలే విడుదలైన ఐఫోన్ 8, ఇంకా గూగుల్ నుండి తాజాగ వచ్చిన పిక్సెల్ హ్యాండ్సెట్లు కూడా ఈ జాబితాలో కనిపిస్తాయి, "అని డేటా డెవలపర్ జర్నలిస్ట్ మార్టిన్ ఆర్మ్ స్ట్రాంగ్ ఒక బ్లాగులో రాశారు.

రేడియేషన్ ప్రొటెక్షన్ కోసం జర్మన్ ఫెడరల్ ఆఫీస్ (బుండేసమ్ట్ ఫర్ స్ట్రాహ్లెన్స్చట్జ్) చేసిన ప్రమాణాల ఆధారంగా ఈ స్కోరింగ్ జరిగింది. ఫోన్ రేడియేషన్ యొక్క ఒక సురక్షితమైన స్థాయి కోసం ఎటువంటి యూనివర్సల్ మార్గదర్శి లేదు, అయితే, జర్మన్ సర్టిఫికేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లినెస్ 'Der Blaue Engel ' (బ్లూ ఏంజెల్) కేవలం కిలోగ్రాముకు 0.60 వాట్స్ కంటే తక్కువ శోషణ రేటు కలిగిన ఫోన్లను మాత్రమే ధృవీకరిస్తుంది. Statista సంకలనం చేసిన సమాచారం ప్రకారం, బ్లాగులో ఉన్న అన్ని ఫోన్లు కూడా ఈ బెంచ్మార్క్ కంటే రెట్టింపు కంటే ఎక్కువగా వచ్చాయి.

ఈ పరిశోధన సంస్థ రేడియోధార్మికత యొక్క తక్కువ మొత్తాన్ని విడుదల చేసే ఫోన్లను కూడా జాబితా చేసింది. శామ్సంగ్ గెలాక్సీ నోట్ 8 ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది, తర్వాత ZTE ఆక్సోన్ ఎలైట్ వుంది. ఇక LG G7, శామ్సంగ్ గెలాక్సీ A8 మరియు శామ్సంగ్ గెలాక్సీ S8 + వరుసగా మూడు, నాలుగో, ఐదవ స్థానాల్లో వరుసగా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. "నిజానికి, శామ్సంగ్ హ్యాండ్సెట్స్ ప్రముఖంగా ఉంటాయి, ఈ జాబితాలో సగానికి పైగా ఫోన్లు, ఈ దక్షిణ కొరియా కంపెనీ నుంచి వచ్చినవే. ఇది వారి ప్రధాన ప్రత్యర్థి అయిన, ఆపిల్ కి విరుద్ధంగా ఉంటుంది. శామ్సంగ్ నుంచి ఎటువంటి ఫోన్ కూడా రేడియేషన్ అధికంగా వున్నా లిస్ట్ లో స్థానాన్ని సంపాదించలేదు, కానీ  ఈ జాబితాలో రెండు ఐఫోన్లతో ఆపిల్ ఆక్రమించుకుంది, "అని ఆర్మ్ స్ట్రాంగ్ అన్నారు. బ్లాగులో ఉన్న అన్ని ఫోన్లు కూడా

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo