2018 ఐఫోన్ ల కొత్త డమ్మీ లీక్ మూడు రకాల్లో సారూప్యతలు మరియు వైవిధ్యాలను చూపుతున్నాయి

2018 ఐఫోన్ ల కొత్త డమ్మీ లీక్ మూడు రకాల్లో సారూప్యతలు మరియు వైవిధ్యాలను చూపుతున్నాయి
HIGHLIGHTS

ముందు వైపువుంచి చూస్తే, మూడు ఐఫోన్లు ఒకే విధంగా ఉంటాయి. OLED డిస్ప్లే తో కూడిన 5.8- అంగుళాల మరియు 6.5- అంగుళాల మోడళ్లు ఉన్నాయి ఇంకా డ్యూయల్-కెమేరా వ్యవస్థ కలిగి ఉండడం దీని కెమేరాలో ప్రధాన మార్పు కనిపిస్తుంది మరియు LCD ప్యానెల్ లో మాత్రం సింగిల్ కెమేరా ఉంటుంది.

యాపిల్ సెప్టెంబర్లో మూడు ఐఫోన్లను ప్రారంభించనున్నది, రెండు OLED డిస్ప్లేలు మరియు ఒక LCD ప్యానెల్ తో కూడిన  దివిజ్ ని ఒక సరసమైన డివైజ్ గా అందించనుంది. గత సంవత్సరం ఐఫోన్ X లాంటి డిజైన్ నే  ఈ 2018 శ్రేణిలో కూడా  కలిగి ఉంటుంది. అనేక లీక్స్టర్లు ఇప్పటికే ఫోన్ల ముందు భాగాల చిత్రాలు మరియు వెనుక కవర్లు, ఇతర అంశాలతో పాటు, డివైజ్  నమూనాలను ధృవీకరించడానికి పోస్ట్ చేశారు. ప్రస్తుతం, ప్రముఖ లీక్స్టర్ అయిన బెన్ గెస్కిన్  మూడు  సుమ్మీ యూనిట్స్  ఫోటోలను పోస్ట్ చేశారు. వారు ట్వీట్ చేసిన చిత్రాలలో కనబడిన మాదిరిగానే ఐఫోన్లు సరిగ్గా అలానే కనిపిస్తాయని లీకేస్టర్ పేర్కొంది. 

 ఐఫోన్ కి సంభందించిన ఈ చిత్రంలో మూడు డమ్మీలుఉంచబడ్డాయి ఇందులో కుడి వైపున ఉంచిన 6.5-అంగుళాల ఐఫోన్ మరియు ఎడమవైపు ఉన్న 5.8-అంగుళాల ఫోన్ తో ఇరువైపులా ఉంచబడ్డాయి. వీటి మధ్యలో, మూడవ అత్యంత సరసమైన ఐఫోన్ ఉంది. ముందువైపు నుంచి మాత్రం , అన్ని ఫోన్లు ఒకదానితో మరొకటి పోలి ఉంటాయి. ఎడమ అంచున వాల్యూమ్ రాకర్ మరియు మ్యూట్ స్విచ్, ఇంకా కుడి అంచున ఫోన్ పవర్ బటన్ని కలిగి ఉంటాయి. ఫోన్లును తిప్పి  పెట్టినప్పుడు, కెమేరా పరంగా OLED వైవిధ్యాలలో సౌష్ఠత  ఉంది. ఈ రెండు ఫోన్లు కూడా డ్యూయల్ – కెమేరా అమర్పులు కలిగివున్నాయి.  ఐఫోన్ X మాదిరిగా ఇందులో కూడా వెనుకవైపు భాగంలో కెమేరాలు ఒక నిలువు పద్ధతిలో సమలేఖనం చేయబడ్డాయి. మధ్యలో ఉన్నఫోన్లో మాత్రం  ఒకే ఒక కెమేరా మరియు కెమేరా క్రింద, ఒక LED ఫ్లాష్ ఉంది.

ఇప్పుడు ఒకే కెమెరా – LCD ప్యానల్తో పాటు ఇవ్వడం ద్వారా    ఫోన్ యొక్క ధరను తగ్గించదానికి ఇది ఒక మార్గం అయ్యింది. ఈ చిత్రాలు ఇప్పటికే ఇంటర్నెట్లో రౌండ్లు చేస్తున్న పుకార్లు మరియు వాదనలకు అనుగుణంగా ఉంటాయి. రెండు రోజుల క్రితం, అదే లీక్స్టర్ ట్విట్టర్లో 6.5-అంగుళాల మరియు 6.1-అంగుళాల ఐఫోన్ల ఫోటోలను పోస్ట్ చేసింది. ఆపిల్ 6.5 అంగుళాల OLED ఐఫోన్ ని $ 900- $ 1,000, రెండవ తరం OLED ఐఫోన్ $ 800- $ 900 మరియు 6.1-అంగుళాల LCD ఐఫోన్ $ 600 – $ 700 ల కోసం ప్రారంభించింది.

ఒక ప్రత్యేక అభివృద్ధిలో, ఆపిల్ తన iOS 12 ను ఆప్టిమైజ్ చేసింది, అదే విధంగా స్థానిక యాప్స్ ని ల్యాండ్స్కేప్ మోడ్లో వీక్షించినప్పుడు, అవి వారి ఐప్యాడ్ ప్రతిరూపానికి సమానంగా కనిపిస్తాయి. ఒక బ్రెజిలియన్ వెబ్సైట్ ఐహెల్ప్ బీఆర్ ప్రకారం, బీటా 5 iOS యొక్క 12 వ నవీకరణ / ఫీచర్ తో వచ్చింది. "యాపిల్ నిన్న డెవలపర్ల కోసం iOS 12 యొక్క ఐదవ టెస్ట్   వెర్షన్ విడుదల చేసింది.  ఆశ్చర్యకరంగా, ఐఫోన్ XS ప్లస్ యొక్క  సపోర్ట్ స్పష్టతతో కొత్త బిల్డ్ ని నడిపిస్తున్నపుడు, ల్యాండ్స్కేప్ మోడ్లో అనువర్తనాలు పెద్ద మోడల్స్ లో ప్రదర్శించబడేటట్లు చూడవచ్చు. అంటే, పెద్ద స్క్రీన్ స్థలం యొక్క మెరుగైన ప్రయోజనాన్ని పొందడం", అని ప్లాట్ఫారం పోస్ట్ చేసింది. దీని ద్వారా భవిష్యత్తులో పెద్ద స్క్రీన్లతో కూడిన ఐఫోన్లను తయారు చేసేందుకు కంపెనీ ఇప్పటికే యోచిస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo