Apple iPhone 18 Pro శక్తివంతమైన ప్రోసెసర్ మరియు కెమెరాతో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

Apple iPhone 18 Pro ఫోన్ ని యాపిల్ ఈరోజు యావత్ ప్రపంచానికి పరిచయం చేసింది

ఈ ఫోన్ ను శక్తివంతమైన ప్రోసెసర్ మరియు కెమెరాతో లాంచ్ చేసింది

ఈ ఫోన్ లో మరింత మెరుగైన యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కూడా అందించింది

Apple iPhone 18 Pro ఫోన్ ని యాపిల్ ఈరోజు యావత్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఇన్నాళ్లు ముసుగు వేసి ఏమాత్రం లీక్స్ కి అవకాశం లేకుండా కాపాడుకుంటూ వచ్చిన ఈ ఫోన్ ని కవర్ తీసి చూపించింది. ఈ ఫోన్ ను శక్తివంతమైన ప్రోసెసర్ మరియు కెమెరాతో లాంచ్ చేసింది. ముఖ్యంగా, ఈ ఫోన్ డిజైన్ లో కూడా మార్పు చేయడం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. యాపిల్ సరికొత్తగా విడుదల చేసిన ఈ లేటెస్ట్ ఐఫోన్ 18 సిరీస్ ఫోన్ ఫీచర్స్ తెలుసుకుందామా.

Apple iPhone 18 Pro: ఫీచర్స్

యాపిల్ ఐఫోన్ 18 ప్రో ఫోన్ ను 2nm ఫ్యాబ్రికేషన్ టెక్నాలజీతో యాపిల్ తయారు చేసిన A20 Pro Chip తో విడుదల చేసింది. ఈ ఫోన్ ను 256GB, 512GB మరియు 1TB స్టోరేజ్ ఆప్షన్ తో అందించింది. ఇది గత సిరీస్ ఐఫోన్ ప్రో వేరియంట్ కంటే కూడా 20 శాతం అధిక పెర్ఫార్మన్స్ అందించే శక్తి కలిగి ఉంటుందని యాపిల్ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ లో మరింత మెరుగైన యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫోన్ ఇప్పుడు 26 ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ లో ఏఐ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను వేగంగా చల్లబరిచే వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం ని కూడా అందించింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :