Apple iPhone 18 Pro శక్తివంతమైన ప్రోసెసర్ మరియు కెమెరాతో లాంచ్ అయ్యింది.!
Apple iPhone 18 Pro ఫోన్ ని యాపిల్ ఈరోజు యావత్ ప్రపంచానికి పరిచయం చేసింది
ఈ ఫోన్ ను శక్తివంతమైన ప్రోసెసర్ మరియు కెమెరాతో లాంచ్ చేసింది
ఈ ఫోన్ లో మరింత మెరుగైన యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కూడా అందించింది
Apple iPhone 18 Pro ఫోన్ ని యాపిల్ ఈరోజు యావత్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఇన్నాళ్లు ముసుగు వేసి ఏమాత్రం లీక్స్ కి అవకాశం లేకుండా కాపాడుకుంటూ వచ్చిన ఈ ఫోన్ ని కవర్ తీసి చూపించింది. ఈ ఫోన్ ను శక్తివంతమైన ప్రోసెసర్ మరియు కెమెరాతో లాంచ్ చేసింది. ముఖ్యంగా, ఈ ఫోన్ డిజైన్ లో కూడా మార్పు చేయడం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. యాపిల్ సరికొత్తగా విడుదల చేసిన ఈ లేటెస్ట్ ఐఫోన్ 18 సిరీస్ ఫోన్ ఫీచర్స్ తెలుసుకుందామా.
SurveyApple iPhone 18 Pro: ధర
యాపిల్ ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను మొత్తం నాలుగు స్టోరేజ్ వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ నాలుగు వేరియంట్ ఇండియా ధర వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
- యాపిల్ ఐఫోన్ 18 ప్రో (256GB) ధర : రూ. 1,64,900
- యాపిల్ ఐఫోన్ 18 ప్రో (512GB) ధర : రూ. 1,89,900
- యాపిల్ ఐఫోన్ 18 ప్రో (1TB) ధర : రూ. 2,39,900
- యాపిల్ ఐఫోన్ 18 ప్రో (2TB) ధర : రూ. 3,14,900
యాపిల్ ఈ ఫోన్ ను బర్గండి, గ్లేసియర్, సిల్వర్ మరియు బ్లాక్ మొత్తం నాలుగు రంగుల్లో లాంచ్ చేసింది.
ఆఫర్స్
ఈ ఫోన్ పై 6 నెలల No Cost EMI ఆఫర్ మరియు లీడింగ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ పై రూ. 7000 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ ని కూడా అందించింది.
Also Read: Apple Airpods 5: మరింత శక్తివంతమైన ANC అండ్ సౌండ్ సపోర్ట్ తో లాంచ్ అయ్యింది.!
Apple iPhone 18 Pro: ఫీచర్స్
యాపిల్ ఐఫోన్ 18 ప్రో ఫోన్ ను 2nm ఫ్యాబ్రికేషన్ టెక్నాలజీతో యాపిల్ తయారు చేసిన A20 Pro Chip తో విడుదల చేసింది. ఈ ఫోన్ ను 256GB, 512GB, 1TB మరియు 2TB స్టోరేజ్ ఆప్షన్ తో అందించింది. ఇది గత సిరీస్ ఐఫోన్ ప్రో వేరియంట్ కంటే కూడా 20 శాతం అధిక పెర్ఫార్మన్స్ అందించే శక్తి కలిగి ఉంటుందని యాపిల్ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ లో మరింత మెరుగైన యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫోన్ ఇప్పుడు 26 ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ లో ఏఐ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను వేగంగా చల్లబరిచే వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం ని కూడా అందించింది.
అందించింది. ఇది గత సిరీస్ ఐఫోన్ ప్రో వేరియంట్ కంటే కూడా శాతం అధిక పెర్ఫార్మన్స్ అందించే శక్తి కలిగి ఉంటుందని యాపిల్ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ లో మరింత మెరుగైన యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫోన్ ఇప్పుడు 26 ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ లో ఏఐ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను వేగంగా చల్లబరిచే వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం ని కూడా అందించింది.
ఈ ఫోన్ 6.3 ఇంచ్ సూపర్ రెటీనా XDR స్క్రీన్ తో లాంచ్ అయ్యింది. యాపిల్ ఈ స్క్రీన్ ను ప్రొమోషన్ టెక్నాలజీ మరియు డైనమిక్ ఐల్యాండ్ వంటి ఫీచర్ తో అందించింది. ఈ ఫోన్ అల్యూమినియం బాడీతో వస్తుంది మరియు ఐఫోన్ ఐకానిక్ డిజైన్ తో ఉంటుంది. యాపిల్ ఈ ఫోన్ ను ఈసారి 43 గంటల లాంగ్ వీడియో ప్లే బ్యాక్ అందించే పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ చేసింది.
ఇక ఈ ఫోన్ లో అందించిన కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఇందులో కూడా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించింది. అయితే, ఈసారి కెమెరా అపర్చర్ పై ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లు యాపిల్ వెల్లడించింది. ఇందులో ట్రిపుల్ 48MP కెమెరాలు ఉంటాయి మరియు ముందు 18MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 8x ఆప్టికల్ జూమ్, 120fps 4K Dolby Vision వీడియో రికార్డింగ్ సపోర్ట్ వంటి అల్ట్రా ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ తో నేరుగా హాలీవుడ్ రేంజ్ సినిమాలు తీసుకోవచ్చని యాపిల్ ఈ ఫోన్ కెమెరా గురించి గొప్పగా పొగిడింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
