Apple Airpods 5: మరింత శక్తివంతమైన ANC అండ్ సౌండ్ సపోర్ట్ తో లాంచ్ అయ్యింది.!
యాపిల్ ఈ కొత్త ఎయిర్ పాడ్స్ ని పర్సనలైజ్డ్ స్పెషల్ ఫీచర్ తో అందించింది
యాపిల్ ప్రత్యేకంగా నిర్వహించిన బిగ్ ఈవెంట్ నుంచి కొత్త ఎయిర్ పాడ్స్ 5 ని రిలీజ్ చేసింది
గొప్ప సౌండ్ అందించే స్పీకర్ సెటప్ మరియు రెట్టించిన ANC మెరుగుదల వంటి ఫీచర్స్ తో లాంచ్ చేసింది
Apple Airpods 5: ఈరోజు యాపిల్ ప్రత్యేకంగా నిర్వహించిన బిగ్ ఈవెంట్ నుంచి కొత్త ఎయిర్ పాడ్స్ 5 ని రిలీజ్ చేసింది. ఈ కొత్త పాడ్స్ ని గొప్ప సౌండ్ అందించే స్పీకర్ సెటప్ మరియు రెట్టించిన ANC మెరుగుదల వంటి ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ కొత్త బడ్స్ లో లైవ్ ట్రాన్స్ లేషన్ ఫీచర్ ని కూడా జత చేసింది. మొత్తానికి ఈ కొత్త ఎయిర్ పాడ్స్ ని గత పాడ్స్ తో పోలిస్తే మరింత మెరుగుదలతో లాంచ్ చేసింది. ఈ కొత్త యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
SurveyApple Airpods 5: ప్రైస్
యాపిల్ ఈ లేటెస్ట్ ఎయిర్ పాడ్ 5 ని కేవలం రూ. 14,900 రూపాయల బడ్జెట్ ధరలో విడుదల చేసింది. అయితే, వైర్లెస్ ఛార్జింగ్ కేస్ తో వచ్చే మోడల్ ని మాత్రం రూ. 17,900 రూపాయల ధరలో లాంచ్ చేసింది. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి ఈ బడ్స్ అందుబాటులోకి వస్తుంది. అయితే, ప్రస్తుతం ఈ బడ్స్ ను ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు.
Also Read: Apple iPhone Duo: ఆపిల్ నుంచి సంచలన ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది .. చూస్తే మతి పోతుంది.!
Apple Airpods 5: ఫీచర్స్
యాపిల్ ఈ కొత్త ఎయిర్ పాడ్స్ ని పర్సనలైజ్డ్ స్పెషల్ ఫీచర్ తో అందించింది. ఇది యూజర్ కి అవసరమైన విధంగా మార్చుకుని ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. ఇది కాకుండా వాల్యూమ్ కంట్రోల్స్ కోసం వాల్యూమ్ స్వీప్ కంట్రోల్స్ తో అందించింది. ఈ ఫీచర్ తో ఈ బెడ్స్ ను చాలా సౌకర్యవంతంగా మార్చింది. అంతేకాదు, యాపిల్ కొత్తగా రిలీజ్ చేసిన లేటెస్ట్ Siri AI ఫీచర్ తో లాంచ్ చేసింది.

ఇక ఈ బడ్స్ లో అందించిన స్పీకర్ల విషయానికి వస్తే, ఇందులో కస్టమ్ ఎక్స్ కర్షన్ యాపిల్ డ్రైవర్స్ అందించింది. అంతేకాదు, ఈ బడ్స్ లో కష్టం హై డైనమిక్ రేంజ్ ఆమ్ప్లిఫైర్ ని కూడా అందించింది. అంతేకాదు, మరింత లీనమయ్యే ధ్వని కోసం డైనమిక్ హెడ్ ట్రాకింగ్ తో పర్సనలైజ్డ్ స్పేషియల్ ఆడియో మరియు అడాప్టివ్ ఈక్వలైజర్ తో జాబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.
ఇది కాకుండా స్టూడియో క్వాలిటీ ఆడియో రికార్డింగ్ మరియు వాయిస్ ఐసోలేషన్ ఫీచర్ తో ఈ బడ్స్ ను యాప్ అందించింది. ఇది మరింత గొప్ప ANC తో లీనమయ్యే నోయిస్ ఆఫర్ చేస్తుంది. ఇందులో లాంగ్వేజ్ కమ్యూనికేషన్ కోసం Live Translation సపోర్ట్ ని కూడా అందించింది. ఇందులో డ్యూయల్ బీమ్ ఫామింగ్ మైక్రో ఫోన్స్, ఇన్ వార్డ్ ఫేసింగ్ మైక్రో ఫోన్ మరియు ఆప్టికల్ ఇన్ ఇయర్ సెన్సార్ కూడా వ్ఞతుంది. అలాగే, ఈ పాడ్స్ ను H2 headphone చిప్ తో లాంచ్ చేసింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
