Apple iPhone Duo: ఆపిల్ నుంచి సంచలన ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది .. చూస్తే మతి పోతుంది.!

HIGHLIGHTS

మోస్ట్ ఎవైటెడ్ ఐఫోన్ యాపిల్ ఐఫోన్ డుయో ని యాపిల్ ఎట్టకేలకు ఈ రోజు విడుదల చేసింది

Apple iPhone Duo: ఆపిల్ నుంచి సంచలన ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది .. చూస్తే మతి పోతుంది.!

Apple iPhone Duo: ప్రపంచం మొత్తం ఉత్కంఠతో ఎదురు చూస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఐఫోన్, యాపిల్ ఐఫోన్ డుయో ని యాపిల్ ఎట్టకేలకు ఈ రోజు విడుదల చేసింది. ఈ ఫోన్ ను అత్యున్నతమైన ఫీచర్స్ మరియు అల్ట్రా ప్రీమియం డిజైన్ తో లాంచ్ చేసింది. కేవలం పస పోర్ట్ సైజులో విడుదల చేసి అందరిని నివ్వెరపరిచింది. ఇది చూడటానికి అద్భుతమైన డిజైన్ తో ఉండటం మాత్రమే కాకుండా గొప్ప ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ తో ఐఫోన్ ఫోల్డ్ ఫోన్ మార్కెట్ లో ప్రకంపనలు సృష్టించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Apple iPhone Duo: ధర

  • యాపిల్ ఐఫోన్ డుయో (256GB) ధర : రూ. 2,99,900
  • యాపిల్ ఐఫోన్ డుయో (512GB) ధర : రూ. 3,24,900
  • యాపిల్ ఐఫోన్ డుయో (1TB) ధర : రూ. 3,74,900
  • యాపిల్ ఐఫోన్ డుయో (2TB) ధర : రూ. 4,49,900

ఈ ఫోన్ ను స్టార్ వైట్ మరియు నైట్ స్కై రెండు రంగుల్లో అందించింది. ఐఫోన్ డుయో ఫోన్ ప్రీ ఆర్డర్స్ సెప్టెంబర్ 16వ తేదీ నుంచి స్టార్ట్ చేస్తుంది. అయితే, ఈ ఫోన్ అక్టోబర్ 23వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుందని యాపిల్ తెలిపింది.

Also Read: Apple iPhone 18 Series తో పాటు పాడ్స్ 5 మరియు ఫోల్డబుల్ ఫోన్ ఇండియా ప్రైస్ లిస్ట్ ఇదిగో.!

Apple iPhone Duo: ఫీచర్స్

యాపిల్ ఈ ఫోన్ ను మడత పెట్టగలిగే పెద్ద 7.6 ఇంచ్ సూపర్ రెటినా XDR మెయిన్ స్క్రీన్ తో అందించింది. అలాగే ఈ ఫోన్ లో 5.4 ఇంచ్ సూపర్ రెటినా XDR వెలుపల స్క్రీన్ ను అందించింది. ఈ ఫోన్ లో ఉన్న డిస్ప్లేలు కూడా గొప్ప బ్రైట్నెస్ మరియు రిజల్యూషన్ కలిగి ఉంటాయి. ఈ ఫోన్ సెంటర్ స్క్రీన్ యూజర్ నచ్చిన విధంగా మడతపెట్టి చూడగలిగే విధంగా అందించింది. ఈ ఫోన్ ను రోజువారీ తగిన విధంగా రూపొందించినట్లు ఆపిల్ తెలిపింది. మంచి ఫీల్ కోసం ఈ ఫోన్ డిస్ప్లేని నానో టెక్స్చర్ డిజైన్ తో అందించింది.

Apple iPhone Duo price

ఆపిల్ ఈ ఫోన్ ను కూడా యాపిల్ 18 ప్రో మరియు ప్రో మాక్స్ లో అందించిన అదే A20 Pro Chip తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను కూడా 256GB మొదలుకొని 2TB వరకు మొత్తం నాలుగు వేరియంట్లలో అందించింది. ఈ ఫోన్ అవుటర్ స్క్రీన్ తో 44 గంటల వీడియో ప్లే బ్యాక్ సపోర్ట్ లేదా మెయిన్ స్క్రీన్ తో 31 గంటల వీడియో ప్లే బ్యాక్ కలిగిన బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది.  ముఖ్యంగా, ఈ ఫోన్ ను టైటానియం ఫ్రేమ్ మరియు హింజ్ కవర్ తో చాలా దృఢమైన అండ్ అందమైన డిజైన్ తో అందించింది.

కెమెరా పరంగా, ఈ కొత్త ఫోల్డబుల్ ఐఫోన్ 48MP డ్యూయల్ ఫ్యూజన్ మరియు 48MP ఫ్యూజన్ మెయిన్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 12MP సెంటర్ స్టేజి సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కూడా 120FPS 4K Dolby Vision వీడియో రికార్డింగ్ మరియు యాపిల్ ప్రత్యేకమైన కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile