Lumio Aura 5 బుక్ షెల్ఫ్ స్పీకర్ల పై నమ్మశక్యం కానీ డిస్కౌంట్ అందించిన అమెజాన్ GIF Sale

HIGHLIGHTS

Lumio Aura 5 ప్రీమియం బుక్ షెల్ఫ్ స్పీకర్లను విడుదల చేసింది

ఈ లేటెస్ట్ ప్రీమియం స్పీకర్ల పైన అమెజాన్ GIF Sale భారీ డిస్కౌంట్ ఆఫర్లను అనౌన్స్ చేసింది

ఈ లేటెస్ట్ బుక్ స్పీకర్లను నమ్మశక్యం కానంత తక్కువ ధరలో మీ సొంతం చేసుకోవచ్చు

Lumio Aura 5 బుక్ షెల్ఫ్ స్పీకర్ల పై నమ్మశక్యం కానీ డిస్కౌంట్ అందించిన అమెజాన్ GIF Sale

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ రీసెంట్ గా Lumio Aura 5 ప్రీమియం బుక్ షెల్ఫ్ స్పీకర్లను విడుదల చేసింది. ఈ లేటెస్ట్ ప్రీమియం స్పీకర్ల పైన ఈరోజు అమెజాన్ GIF Sale భారీ డిస్కౌంట్ ఆఫర్లను అనౌన్స్ చేసింది. అమెజాన్ నుంచి అందించిన ఈ బిగ్ డిస్కౌంట్ ఆఫర్లతో ఈ లేటెస్ట్ బుక్ స్పీకర్లను నమ్మశక్యం కానంత తక్కువ ధరలో మీ సొంతం చేసుకోవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lumio Aura 5 స్పీకర్ ప్రైస్ అండ్ ఆఫర్స్

లూమియా ఆరా 5 హై-ఫై బుక్ షెల్స్ స్పీకర్లను ఇండియన్ మార్కెట్ లో రూ. 24,999 లాంచ్ ప్రైస్ తో రిలీజ్ చేసింది. అయితే, అమెజాన్ సేల్ అందించిన లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ లో భాగంగా రూ. 2,000 కూపన్ డిస్కౌంట్ తో రూ. 19,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. అంతేకాదు, ఈ హై-ఫై బుక్ షెల్స్ స్పీకర్ ICICI మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డుతో తీసుకునే వారికి రూ. 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది.

ఈ హై-ఫై బుక్ షెల్స్ స్పీకర్ పై అందించిన ఈ రెండు డిస్కౌంట్ ఆఫర్స్ అందుకుంటే, ఈ స్పీకర్లను కేవలం రూ. 18,249 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. అంటే, ఈ లేటెస్ట్ స్పీకర్లను అమెజాన్ సేల్ నుంచి ఈరోజు మంచి ఆఫర్ ధరలో అందుకోవచ్చు. ఈ హై-ఫై బుక్ షెల్స్ స్పీకర్లను ఆఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన క్లిక్ చేయండి.

Lumio Aura 5 : ఫీచర్స్

లూమియా చాలా ప్రీమియం డిజైన్ మరియు గొప్ప సౌండ్ అందించే సెటప్ తో ఈ స్పీకర్ లను అందించింది. ఈ సెటప్ లో రెండు స్పీకర్ బాక్స్ లు ఉంటాయి మరియు ఒక్కొక్క బాక్స్ లో 4.5 ఇంచ్ అల్యూమినియం ఉఫర్ అండ్ 1 ఇంచ్ సిల్క్ డూమ్ ట్వీటర్ ఉంటాయి. ఈ రెండు స్పీకర్లు టోటల్ 200W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది.

Lumio Aura 5 amazon GIF Sale offer

ఈ స్పీకర్ ముఖ్యమైన ఫీచర్ ఏమిటంటే ఈ స్పీకర్ 1 మీటర్ డిస్టెన్స్ లో 105 dB SPL సౌండ్ అందిస్తుంది. ఇది మాత్రమే కాదు 35Hz బాస్ ఎక్స్ టెన్షన్ సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది. అంటే, సింపుల్ గా చెప్పాలంటే డిడ్ చాలా డీప్ అండ్ రిచ్ సౌండ్ ని అందిస్తుంది.ఇది కాకుండా 1% THD తో స్టూడియో లో వచ్చే ప్యూర్ ఆడియోని అందిస్తుంది. అంటే, ఇది డిస్టార్షన్ ని ప్యూర్ ఆడియో మీకు ఆఫర్ చేస్తుంది.

ఈ హై-ఫై బుక్ షెల్స్ స్పీకర్ 35Hz – 20,000Hz (20kHz) ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూజ్ చేస్తుంది కాబట్టి మీ సినిమా అండ్ మ్యూజిక్ అనుభూతి చాలా ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది. ఇది FLAC 24-bit/48 kHz ఫీచర్ తో ప్రీమియం అండ్ లాస్ లెస్ ఆడియో మీకు ఆఫర్ చేస్తుంది. లిమియో ఇందులో ఈ స్పీకర్లు బిల్ట్ ఇన్ Class-D amplifier అందించింది.

Also Read: iPhone Duo ఫోన్ ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ .. బిగ్ డీల్స్ తో సేల్ మొదలయ్యింది.!

కనెక్టివిటీ పరంగా కూడా ఈ లేటెస్ట్ హై-ఫై బుక్ షెల్స్ స్పీకర్లు గొప్పగా ఉంటాయి. ఎందుకంటే, ఇందులో HDMI ARC, CEC, USB, coaxial మరియు 3.5mm పోర్ట్ వంటి కంప్లీట్ కనెక్టివిటీ సపోర్ట్ అందించింది. బిల్ట్ ఇన్ డిస్ప్లే కలిగిన Minion OLED రిమోట్ ని కూడా ఈ స్పీకర్లతో అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile